ర్యాంప్ పై ఐశ్వర్యారాయ్ ‘వావ్..సింప్లీ’

ముంబాయి:

ఏదైనా ఫ్యాషన్ షోకి మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ షో స్టాపర్ అయితే ఆ షో సూపర్ హిట్టేనని వేరే చెప్పనక్కర్లేదు. ర్యాంప్ పై ఐశ్వర్య సొగసుగా క్యాట్ వాక్ చేస్తూ వచ్చిందంటే కదిలే సౌందర్యాన్ని చూస్తూ ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావడం ఖాయం. సరిగ్గా ఇదే ఖతర్ రాజధాని దోహాలో నిర్వహించిన ఫ్యాషన్ వీకెండ్ ఇంటర్నేషనల్ 2018లో జరిగింది.ఐశ్వర్య తన ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షోలో షో స్టాపర్ గా వచ్చి అందరినీ ఆకట్టుకుంది. మనీష్ రూపొందించిన వైట్ అండ్ రెడ్ రంగుల హెవీ గౌన్ ధరించి మాజీ మిస్ వరల్డ్ ర్యాంప్ పై తళుక్కుమంది. అలా హొయలు పోతూ బచ్చన్ల బహురానీ నడుస్తుంటే అంతా కళ్లు తిప్పుకోలేకపోయారు.

ఈ షోలో ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా అదే తరహా గౌన్ వేసుకొని ర్యాంప్ పై నడుస్తుంటే ప్రేక్షకులంతా ముచ్చటపడ్డారు. తన షో సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో మనీష్ మల్హోత్రా ‘వావ్..సింప్లీ’ అని కామెంట్ పెట్టి ఐశ్వర్యారాయ్ ర్యాంప్ వాక్ వీడియోని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.