లావాదేవీలకో సెర్చింజన్.. మోడీ కొత్త ఐడియా.

న్యూఢిల్లీ:
నల్లధనంపై పోరాటం.. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఈ నినాదంతో ప్రజలు బాగానే కనెక్టయ్యారు. కానీ నల్లధనం వెలికితీయడం అంత ఈజీనా? అంటే కాదనే చెప్పాలి. నల్లధనం కేసుల్లో డబ్బు చేతులు మారిన వ్యవహారాలను కనిపెట్టడం అధికారులకు పెద్ద సవాలనే చెప్పాలి. ఏవేవో లావాదేవీల్లో ఎన్నో చేతులు మారుతూ వచ్చే సొమ్మును సోదాలలో వెలికితీసి ఇదంతా నల్లధనం అని చెప్పినంత తేలిక కాదు. రుజువులు చూపాలి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఆ లావాదేవీలపై కన్నేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రూపాయి రాకపోకలపై నిఘా పెట్టబోతున్నారు. దేశంలోని అన్ని చెల్లింపులకు ఒక డేటాబేస్ లేదా సెర్చి ఇంజిన్ ద్వారా జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నాయి. దీంతో మనీ లాండరింగ్, షెల్ కంపెనీలు వంటి నల్లధనాన్ని తెలుపు చేసుకొనే మార్గాలని గుర్తించడం సులభం అవుతుందని చెబుతున్నారు.