లోయలో పడ్డ బస్సు: 12 మంది మృతి.

ముంబయి:
బస్సు లోయలో పడిన దుర్ఘటనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని కొంకన్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన 40 మంది వారాంతపు సెలవుల్లో విహారం కోసం మహాబలేస్వరం బయలుదేరారు. కానీ రాయగఢ్ జిల్లాలో బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద స్థలం ముంబయి కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కొందరు ట్రెక్కింగ్ చేసే యువకులు ఈ ఘటనపై సమాచారం అందించారు. రాయగఢ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.