వంగవీటి రంగా హత్యకు దేవినేని ఉమా మాస్టర్ మైండ్. -వసంత నాగేశ్వరరావు.

విజయవాడ : 
వంగవీటి రంగా హత్యలో మాస్టర్‌ప్లాన్‌ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుదేనని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. రోజుకొక పార్టీ మారుతూ, ఆస్తుల కోసం హత్యలు చేసే హంత కులు డబ్బు సంచులతో వస్తున్నారంటూ తనపై, కృష్ణప్రసాద్‌పై మంత్రి ఉమా కొద్దిరోజులుగా చేస్తున్న ఆరోపణలను వసంత తీవ్రంగా ఖండించారు. కంచికచర్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి దేవినేని ఉమా వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హత్యలు చేసి జైళ్లకెళ్లింది ఉమా కుటుంబీకులేనన్నారు.
దేవినేని ఉమా వదిన ఎలా చనిపోయిందో, ఎవరి హస్తముందో అందరికీ తెలుసన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కంచికచర్ల, వీరులపాడు మండలాలకు జలవనరుల శాఖ మంత్రిగా సాగునీరు కూడా ఇవ్వలేదని, ఉమా అంతటి అసమర్థుడు మరొకరు లేరన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ బొమ్మిశెట్టి భాస్కరరావు, మాజీ వైస్‌ చైర్మన్‌ మాగంటి వెంకట రామారావు (అబ్బాయి), సొసైటీ మాజీ అధ్యక్షుడు చింతా రవీంద్రనాథ్‌, గొట్టుముక్కల, చెవిటికల్లు గ్రామాల సర్పంచ్‌లు గుదే రంగారావు, బొమ్మిన శ్రీని వాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు, దమ్మాలపాటి వెంకట్రావు, రాయల శ్రీనివాసరావు, అబ్బూరి నాగమల్లేశ్వరరావు, గుదే సాంబశివరావు పాల్గొన్నారు.