వచ్చే ఎన్నికల్లో బీసీ లకు 40 శాతం సీట్లు.

ఢిల్లీ:
ఢిల్లీ లో బలహీన వర్గాల కాంగ్రెస్ జాతీయ సదస్సు సోమవారం జరిగింది. తెలంగాణా నుండి వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య ,పొన్నం ప్రభాకర్ ,చిత్తరంజన్ దాస్ సురేష్ షెట్కార్,రాపోలు ఆనంద్ భాస్కర్ ,కత్తి వెంకట స్వామి డాక్టర్ వినయ కుమార్ ,కొమ్మిరెడ్డి రాములు, నూతి శ్రీకాంత్ , వివిధ జిల్లాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ,అశోక్ గేహలోట్ గారు జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షులు సాహు ,కుంతియా కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఓబీసీ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం పలువురు కాంగ్రెస్ బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గుల్ గ్రామం నుంచి వందలాది మంది కార్యకర్తలు తరలివెళ్లారు. డీసీసీ ప్లానింగ్ కమిటీ మెంబర్, బండగ్ పేట నగరపంచాయతీ ప్లోర్ లీడర్ శ్రీశైలం యాదవ్ మరియు నిమల్ల నరేదెర్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఓబీసీ సదస్సుకు వెళ్లారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైయ్యారని యాతం శ్రీశైలం యాదవ్ తెలిపారు. ప్రధానిగా మోడీ అయ్యాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని రాహుల్ అన్నట్లు శ్రీశైలం యాదవ్ చెప్పారు. బీసీలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు డీసీసీ ప్లానింగ్ కమిటీ మెంబర్ శ్రీశైలం యాదవ్. ఈ సదస్సుకు తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ కమిటీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరికితే…. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 40శాతం సీట్లు కేటాయించాలని కోరేందుకు రాష్ట్రకమిటీ ప్రయత్నిస్తున్నట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు.