వచ్చే వారం మరోసారి ఫెస్టివల్ సేల్స్!


న్యూఢిల్లీ:

ఆన్‌లైన్‌ ఫెస్టివల్‌ సీజన్‌ సేల్స్‌ లో బంపర్ ఆఫర్లు మిస్సయ్యారా? ఏం పర్లేదు. వచ్చే వారమే మీకు ఇంకో చాన్స్ దక్కనుంది. దేశంలోని ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లతో వస్తున్నాయి. దీంతో వారం తిరక్కుండానే మరోసారి వినియోగదారుల పంట పండనుంది. దసరా పండుగకు ఐదు రోజులపాటు ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నిర్వహించిన అమెజాన్ దీపావళికి కూడా ఫెస్టివల్ సేల్ జరుపబోతోంది. రెండో విడత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 24-28 వరకు జరుగనుంది. 24 అర్థరాత్రి 11.59 గంటలకు ప్రారంభమై 28 అర్థరాత్రి 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ సీజన్‌ సేల్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉండబోతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, హోమ్‌ అప్లయెన్సెస్‌, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఇంకా ఎన్నో ఇతర ఉత్పత్తులపై పలు ఆకర్షణీయమైన డీల్స్‌ను ప్రకటించింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈఎంఐ కార్డుతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఇస్తారు. రూ.5,000 అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేసిన అమెజాన్‌ పే యూజర్లకు రూ.250 వరకు 10% క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

అమెజాన్‌ కొత్త కస్టమర్లందరికీ ఈ సేల్‌లో ఫ్రీ షిప్పింగ్‌ చేస్తారు. ఈ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మి 6ఏ ఫ్లాష్‌ సేల్‌ జరుపుతారు. అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, మూడో జనరేషన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్ కి దొరకనున్నాయి. అలెక్సా ఆధారిత డివైజ్‌లపై 70% వరకు రాయితీ లభించనుంది. బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌ను కేవలం రూ.19కే అమెజాన్‌ అమ్మనుంది. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై వాసులు అమెజాన్‌ ప్రైమ్‌నౌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన రెండు గంటల్లోనే డెలివరీ పొందవచ్చు. అమెజాన్‌ ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ కూడా మరోసారి బంపర్ ఆఫర్లతో వచ్చేస్తోంది. ‘ధమాకా డేస్‌’ పేరుతో త్వరలో సేల్‌ ప్రారంభించన్నట్లు ప్రకటించింది. అయితే ఈ ధమాకా డేస్‌ సేల్‌ను ఏఏ తేదీల్లో నిర్వహిస్తారనే విషయం మాత్రం తెలియలేదు.