విద్యార్ధినిపై లైంగిక దాడి. 7 గురి అరెస్ట్.

తిరువళ్ళూరు:
తమిళనాడులోని తిరువళ్ళూరులో ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఏడుగురు యువకులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. స్థానికురాలైన 10వ తరగతి విద్యార్థిని ఏడాది కాలంగా కొందరు యువకులతో స్నేహం చేస్తోందని, ఈ క్రమంలో మత్తు పదార్థాలకు బానిసైందని తెలిపారు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బడికి వెళ్లకుండా మగపిల్లలతో ఎందుకు తిరుగుతున్నావని రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు మందలించడంతో..ఆగ్రహంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఇదే విషయాన్ని ఆమె తండ్రి ఎస్పీ శిబి చక్రవర్తికి ఫిర్యాదు చేసినట్లు మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాలికకు మద్యం, గంజాయి తాగించి 15 మంది అత్యాచారం చేసినట్లు తేలిందన్నారు. బాధితురాలు ఇచ్చిన వివరాలతో తిరువళ్ళూరు, తలంకాంజేరి, కాకలూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు యువకులను సోమవారం అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు