విద్యార్థి నిరుద్యోగుల పోరు యాత్ర ప్రారంభం.

హైదరాబాద్:
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు బస్సు యాత్ర చేరుకున్నది.40 సార్లు డిఎస్సి వేసి ఒక్కసారి కూడా పరీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి కేసీఆర్ అని జే ఏ సి నాయకులు విమర్షించారు. రాష్ట్రంలో అక్రమ కేసులు, రైతులకు బేడీలు వేసింది తప్ప మరొక్కటి లేదన్నారు.ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయండని కోరారు.
రాజకీయ నాయకులకు ఒక చదువు సామాన్య పిల్లలకు మరో చదువా!! అని ప్రశ్నించారు.
ఇందుకేనా పోరాడి తెలంగాణ తెచ్చుకుందన్నారు.తెలంగాణ వస్తే కేజీ టు పీజీ చదువులు ఉద్యోగాలు వస్తాయని కొలువుల కోసమే కొట్లాడితే ఈ రోజు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఎక్కడ కనీసం ప్రభుత్వ పాటశాలల్లో అటెండర్ పోస్టులను కూడా ప్రభుత్వం నియమించలేదు. నీళ్లు,నిధులు నియామకాలు ఎక్కడ నలుగున్నార సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు రైతులకు బేడీలు వేయడం మరొక్కటి లేదు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ మనువడు ప్రైవేట్ పాటశాలకు వెళ్తే ప్రైవేట్ పాటశాల యాజమాన్యలు దగ్గర ఉండి తీసుకపోతారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పాటశాలల్లో సౌక్యరాలు లేవు తెలంగాణలో మూడు లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల,మంత్రుల పిల్లలు ఏసీ గదులు ప్రైవేట్ కార్పొరేట్ పాటశాలల్లో చదువుతున్నారు కానీ ఓట్లేసి ప్రజల పిల్లలు మాత్రం పాత గోడలు పాములు,తెల్ల మధ్య చదువును కొనసాగిస్తున్నారు ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసిన ఘనుడు కేసీఆర్ అని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన మోసకరి కేసీఆర్ అని కాంట్రాక్టర్లకు వేళ కోట్ల రూపాయలు కట్టబెట్టిన దుర్మార్గుడని అన్నారు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ యాత్రలో భాగంగా షాద్ నగర్ లో ప్రసంగించారు..