విలక్షణ నటిగా తాప్సీ.

ముంబాయి:
సొట్టబుగ్గల తాప్సీ బాలీవుడ్ లో దూసుకుపోతోంది. తాజాగా తాప్సీ నటించిన సూర్మా, ముల్క్ చిత్రాలు అటు విమర్శకులను, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ ఏడాది మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వరుస చిత్రాలు చేస్తున్నా ప్రతి చిత్రంలోనూ తను డిఫరెంట్ గా కనిపిస్తానని చెబుతోంది. వరుసగా సినిమాలు రిలీజవుతున్నా దేనికదే డిఫరెంట్ గా ఉంటుందని చెబుతోంది. ఈ ఏడాది రిలీజవుతున్న సినిమాలు తన స్క్రిప్ట్ జడ్జిమెంట్ కి పరీక్షలని చెప్పింది.
తన పెర్ఫామెన్స్ కు వస్తున్న రెస్పాన్స్ తో తాప్సీ పొంగిపోతోంది. ముల్క్ లో లాయర్ గా తన నటనను పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో పోల్చడంపై ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. మిస్టర్ బచ్చన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులతో నటించడం ఓ మంచి అనుభవం అంటున్న తాప్సీ, నటనపై వారికున్న మమకారం చూస్తే ముచ్చటేస్తుందని అంటోంది. చాలా తక్కువ సమయంలో తన నటనతో రిలయబుల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్న తాప్సీ తను ఇంకా స్టార్ ని కాలేదంటోంది. తన పేరు చూసి జనం థియేటర్లకి వచ్చిన రోజు తనకి స్టార్ డమ్ వచ్చినట్టని నిర్మొహమాటంగా చెప్పింది. తాప్సీ నటించిన మన్ మర్జియా, బద్లా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. మన్ మర్జియాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.