విలేకరిపై ‘ఏనుగు’ ఆగ్రహం!!

కామారెడ్డి:
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి పై వార్తలు రాసినందుకు ‘సాక్షి’దినపత్రిక విలేకరి మురళిపై  మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటు వేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని మరకల్ గ్రామస్తులకు 5 లక్షలు ఇవ్వజూపిన ఘటనపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు విలేకరిపై నోరు పారేసుకోవడం కూడా తాజాగా వైరల్ అవుతున్నది.