వివాహేతర బంధం. జీవితాలు చిన్నాభిన్నం.

హైదరాబాద్:
కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వివాహేతర సంబంధాలు, వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు, భర్తలను దారుణంగా హతమారుస్తున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నారు. విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ఏ ఆడదానికైనా పెళ్లయిన తర్వాత భర్త తోడే లోకం. కానీ చిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దనుకుంటున్నారు.. దాంతో భర్తలను అంతం చేస్తున్నారు. ఓ ప‌క్క బంగారంలాంటి భర్త, అంత‌కు మించిన బంగారంలాంటి పిల్ల‌లు ఉన్నా.. ఆ.. సుఖం కోసం అడ్డ‌దారులు తొక్కి భ‌ర్త‌ల‌ను మ‌ట్టు బెడుతున్నారు. స్వాతి, శ్రీవిద్య, జ్యోతి అలాగే నేడు హైదరాబాద్ కు చెందిన మరో మహిళ. వీరందరు చేసిన పనికి సభ్యసమాజం సిగ్గుపడుతోంది. నాగర్ కర్నూల్ లో ప్రియుడికోసం భర్త సుధాకర్ రెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చిన స్వాతి కథ ఎలా మారిందో తెలిసిందే! కట్టుకున్న భర్తను కాదనుకుని ప్రియుడు రాజేష్ వ్యామోహంలో మునిగిపోయింది స్వాతి. భర్త లేని సమయంలో తరచుగా వచ్చి వెడుతూ స్వాతికి దగ్గరయ్యాడు రాజేష్.. వీరి వ్యవహారం తెలిసిన భర్త సుధాకర్ రెడ్డి స్వాతిని మందలించాడు.. అయినా ఆమె వినకుండా రాజేష్ తో అనైతిక బంధాన్ని కొనసాగించింది. తమ అక్రమ సంబంధానికి భర్త సుధాకర రెడ్డి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా ప్రియుడి సహాయంతో దారుణంగా భర్తను హతమార్చింది. ఆ తరువాత తన భర్తపై యాసిడ్ దాడి జరిగిందని.. దాంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని కొన్ని రోజులు నమ్మించింది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్టు సుధాకర రెడ్డి సోదరుడు వదిన బాగోతాన్ని కనిపెట్టాడు. దాంతో ఈవిడగారి బండారం బయటపడి జైలుజీవితం గడుపుతోంది. అయితే ఇటీవల ఆమెకు బెయిల్ వచ్చినా.. తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ కూడా ఆమెను తీసుకెళ్లడానికి రాలేదంటే ఆమె పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.స్వాతి లాంటి కథే శ్రీవిద్యది.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య స్కూల్ లో టీచర్ గా పనిచేసేది. అయితే ఆమెకు రెండేళ్ల కిందట మేనబావ అయిన నరేంద్రచంద్రతో వివాహం జరిగింది. అయితే అంతకుముందే శ్రీవిద్య అక్క భర్త వీరయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదని, మాట్లాడటానికి వీలుపడటం లేదని భావించిన‌ శ్రీవిద్య భర్త నరేంద్రను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే కట్టుకున్న భర్తను. భావతో కలిసి అంతమొందించింది….స్వాతి, శ్రీవిద్యకు ఎక్కడా తీసిపోను అనుకుందో ఏమో జ్యోతి అనే మహిళ తన భర్తను మట్టుబెట్టింది. నాగరాజు అనే కార్పెంటర్ కు జ్యోతి అనే మహిళతో వివాహం జరిగింది. కొంతకాలానికే కార్తిక్‌ అనే యువకుడితో జ్యోతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. అతన్ని ఎలాగైనా అంతమొంచించాలన్న ప్లాన్ వేసింది. ఈ విషయంలో కార్తిక్‌ స్నేహితుల సహాయం తీసుకుని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అయితే ఈ హత్యలో పాలుపంచుకున్న నరేష్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గుర్తించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు విచారించగా ఈ హత్య కోణం వెలుగుచూసింది. దీంతో జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్ సహా అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు…..ఇక ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. రెండు నెలల కిందట హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. శివరాంపల్లికి చెందిన భర్త ఆనంద్‌ను చంపేసి తగలబెట్టింది. అనంతరం మూసీ నదిలో పడేసింది.ఇక విషయం వెలుగులోకి రావడంతో కిల్లర్ భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది.ఇలా కొందరు మహిళలు ప్రియుళ్ళ ప్రేమ గాలానికి చిక్కి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు.