వి.వి.గృహ నిర్బంధం మరో 4 వారాల పొడిగింపు.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
వరవరరావు సహా ఐదుగురు పౌర హక్కుల కార్యకర్తల అరెస్టుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ అరెస్టులు రాజకీయ ఉద్దేశ్యంతో చేసినవి కావని ధర్మాసనం
అభిప్రాయపడింది. పూణే పోలీసులు విచారణను కొనసాగించవచ్చని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తెలిపింది.పౌరహక్కుల నేతల గృహ నిర్బంధాన్ని మరో నాలుగు వారాలపాటు పొడగించింది.’సిట్’ చేత విచారణ చేయించాలన్న పౌరహక్కులనేతల విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించినది. ఆరోపణలు ఎదుర్కుంటున్నవారు ఏ సంస్థచేత విచారణ చేయించాలని కోరుకొనే హక్కు వారికి లేదని సుప్రీం కోర్టు తెలిపింది.భీమా–కోరేగావ్‌ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవలఖ, వెర్మన్‌ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు.ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్‌ దేశ్‌పాండే సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.