వేదిక ఎక్కడానికి నిరాకరించిన కేంద్ర మంత్రి

చెన్నై:
ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఆర్థిక, నౌకాయాన సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్టేజీ మీద కూర్చొనేందుకు ససేమిరా అన్నారు. శుక్రవారం తమిళనాడులోని నాగపట్టినంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి, ప్రభుత్వ పట్టుమని పాతిక మంది కూడా జనం లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రజలెక్కడ? అని అధికారులను ప్రశ్నించారు. అధికారుల కోసం వచ్చానా అని నిలదీశారు. ప్రజలు రాకపోతే స్టేజ్ మీద కూర్చోనని తేల్చి చెప్పారు. 45 నిమిషాలు ఎదురుచూసినా ఎవరూ రాకపోవడంతో గ్రామస్థులను పిలుచుకు రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఉరుకులు పరుగులు పెడుతూ ఊళ్లోకి వెళ్లిన ప్రభుత్వాధికారులు అప్పటికప్పుడు సుమారు 50 మందికి పైగా ప్రజలను సమావేశ స్థలానికి తీసుకొచ్చారు. అప్పటికి చల్లబడిన కేంద్రమంత్రి స్టేజీ ఎక్కి సమావేశంలో పాల్గొన్నారు.