వైరల్ అయిన ‘అగ్నిధార’.

లండన్:
‘ఫైర్నడో:…..పేరు కొత్తగా ఉందని డిక్షనరీలో వెతకొద్దు. ఎందుకంటే ఇది ఫైర్, టోర్నడో అనే రెండు మాటలు కలిపి కొత్తగా కాయిన్ చేసిన పదం. రావెన్స్ బోర్న్ అనే ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అదే సమయంలో సుడిగాలి వీచింది. ఆ గాలి ఆ మంటలను తనతో సుడులు తిప్పుకుంటూ తీసుకెళ్లింది. దాదాపుగా 50 అడుగులకు పైగా కణకణమండే జ్వాలధారలు ఎగసిపడ్డాయి. ఈ ఫైర్నడో నేలపై ఎదురైన ప్రతి వస్తువును భస్మీపటలం చేసింది. గంటన్నరకు పైగా ఈ అగ్ని ధార కురిసింది. అదృష్టవశాత్తూ ప్రాననష్టం ఏమీ జరగలేదు. ఇంగ్లాండ్ లోని డెర్బీషైర్ కి చెందిన లీసెస్టర్ షైర్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది తమ కళ్లారా ఈ అరుదైన దృశ్యాన్ని చూశారు. అంతే కాకుండా కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ గా మారింది. లక్షలాదిగా వ్యూస్, వేలల్లో షేర్లు వచ్చిపడ్డాయి.