వ్యవస్థ లో చీడపురుగు చంద్రబాబు. మోత్కుపల్లి నర్సింహులు.

యాదాద్రి:
చంద్రబాబు నడిపే టీడీపీ పార్టీ దుర్మార్గపు పార్టీ , ఆంద్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ చేసిండని టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి బుధవారం యాదాద్రి లో అన్నారు. ఓటుకు నోటులో దొరికిన దొంగలు చంద్రబాబు , రేవంత్ రెడ్డి లపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.
హోదా కోసం , పవన్ కళ్యాణ్ , జగన్ కొట్లాడుతున్నారు చంద్రబాబు కాదన్నారు.ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని చెప్పారు.కాపులకు బిసిలకు , బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టాడని విమర్శించారు.రాబోయే ఎన్నికలలో చంద్రబాబు కి ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థ లో చీడ పురుగు చంద్రబాబు అని ఆరోపించారు.
నందమూరి కుటుంబానికి టీడీపీ పార్టీ ని అప్పజెప్పాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబు కి బుద్ది చెబుతారని ఆయన అన్నారు.తనకు మోకాళ్ళ నొప్పి ఉన్నప్పట్టికీ తిరుపతి మెట్లు ఎక్కి వెళ్లి చంద్రబాబు ఓడిపోవాలి అని మొక్కుకుంటానని మోత్కుపల్లి శపతం చేశారు.