శబరిమల గుడి తలుపులు మూసివేత!!

కేరళ:

శబరిమలలో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మాసపూజలు అనంతరం సోమవారం రాత్రి పది గంటలకు శబరిమల ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. మళ్లీ నవంబర్ 3వ వారంలో మండలపూజల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. గత నాలుగు రోజులుగా శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఉవ్వెత్తున లేస్తున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల, పంబ ప్రాంతాల నుంచి మీడియా వెళ్లిపోవాలని, భక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి నిరసనగా శివసేన తదితర హిందూ సంఘాలు ఇవాళ మహార్యాలీ నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీ సందర్భంగా హింస తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాయి.