శాంసంగ్ ‘గెలాక్సీ ఏ9’ విడుదల.

న్యూఢిల్లీ:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టింది. ఇటీవలే ట్రిపుల్ లెన్స్ రియర్ కెమెరాతో అందుబాటు ధరలో గెలాక్సీ ఏ7 స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టిన శాంసంగ్.. ఇవాళ ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాడ్ లెన్స్ రియల్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. గెలాక్సీ ఏ9గా పిలుస్తున్న ఈ నాలుగు వెనుక కెమెరాల ద్వారా మొత్తంగా 47ఎంపీ నాణ్యతతో ఫోటోలు తీయవచ్చని తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ9 స్పెసిఫికేషన్స్

6.3 అంగుళాల అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లే
ఫుల్ హెచ్ డి ప్లస్ రెజొల్యూషన్
18.5:9 ఆస్పెక్టు రేషియో
3,800 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్
2.2 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
512జీబీ మైక్రో ఎస్ డి కార్డ్ సపోర్ట్
24ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
వైఫై, బ్లూటూత్ 5.0, శాంసంగ్ పే (ఎన్ఎఫ్ సి)
ఫింగర్ ప్రింట్ స్కానర్
ఫేస్ అన్ లాక్

నవంబర్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఏ9 కేవియర్ బ్లాక్, లెమనేడ్ బ్లూ, బబుల్ గమ్ పింక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 51,300. ఇండియాలో ఈ ఫోన్‌ను ధర, ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.