శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలి – ఉపరాష్ట్రపతి.

హైదరాబాద్:
హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు.ఇస్రో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని ప్రశంసించారు.
భవిష్యత్ లో సామాన్యులకు ఉపయోగపడే మరిన్ని ప్రయోగాలు చేయాలని దిశానిర్దేశం చేశారు.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. 1975లో తొలి ఉపగ్రహ ప్రయోగం ఆర్యభట్టు మొదలుకుని, అంతరిక్ష రంగంలో భారత్ విజయాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, ఈ విషయంలో చిత్తశుద్ధితో పని చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగాలు సమాచార రంగంలో విప్లవాన్ని సృష్టించాయని, సామాన్యునికి, వ్యవసాయానికి ఉపయోగపడే మరిన్ని ప్రయోగాలకు రూప కల్పన చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణలో NRSC ప్రయోగాలను ఆయన అభినందించారు. ఇది ఇలానే మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.2002లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా NRSC ని సందర్శించానని, మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఈ కేంద్రాన్ని సందర్శించి, అభిప్రాయలను పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ తో పాటు, ఎన్నో సవాళ్ళతో కూడిన ఇస్రో ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న యువశాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
“ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. NRSC లాంటి కీలకమైన కేంద్రంలో, దేశాభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు హర్షించదగినవి.ఇస్రోలో పని చేస్తున్న యువకులందరినీ అభినందిస్తున్నాను. సవాలు విసిరే శాస్త్రీయ ప్రాజెక్టులకు పని చేసే మీరు, మీ నైపుణ్యం నిరూపించుకుంటారని భావిస్తున్నాను.1975లో భారత్ నుంచి మొదటి ఉపగ్రహం ఆర్యభట్టును ప్రయోగించిన నాటి నుంచి, బారత అంతరిక్ష వ్యవస్థ అభివృద్ధి చెందడమే కాదు, విదేశీ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం భారత్ కేంద్రంగా మారింది.ఈ మధ్యే UK కి చెందిన రెండు ఉపగ్రహాలన ప్రయోగంలో విజయం సాధించిన ఇస్రో ఇప్పటి వరకూ 28 దేశాలకు చెందిన 239 విదేశీ ఉపగ్రహాలను ప్రారంభించింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. రాబోయే కాలంలో ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ యవనికపై ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను.ఒకే సారి 104 ఉపగ్రహాల ప్రయోగం, మానవ అంతరిక్ష నౌక గగన్ యాన్ ప్రయోగం కోసం సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం మరియు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో GSLV Mk-III యొక్క ప్రయోగం లాంటి వాటిల్లో విజయవంతమైన ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తలకు నా అభినందనలు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్ వి లాంటి అతిపెద్ద ఉపగ్రహాల కమ్యూనికేషన్ రంగంలో విప్లవమనే చెప్పాలి.రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా మ్యాప్, మానిటరింగ్ ద్వారా సహజ వనరుల నిర్వహణకు తోడ్పడింది. వ్యవసాయ, నీటి వనరులు, పట్టణ ప్రణాళిక, పర్యావణం, అడవులు, సముద్ర వనరులు, జల విశ్లేషణ, విపత్త నిర్వహణ, జీవవైవిధ్యం, కరువు పర్యవేక్షణ, వరద ప్రమాదం జోన్ మ్యాపింగ్ మరియు ఖనిజ వృద్ధికి సంబంధించిన వివిధ రకాల అంశాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
చంద్రయాన్ -1 మరియు మార్స్ ఆర్బిటర్ అంతరిక్ష వాహనాలు విజయాలు ప్రతి భారతీయుణ్ని గర్వించేలా చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్రయాన్-2 కోసం ఇస్రో ప్రయత్నం చేస్తుందని తెలిసి ఆనందిస్తున్నాను.

ఈ కేంద్రాన్ని 2002 లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా సందర్శించాను. మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత తరిగి ఇక్కడకు రావడం, మీతో అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. అప్పటి నుంచి ఏటా ఎన్నో శాటిలైట్ ప్రయోగాలు నిర్వహించారు.శాస్త్రవేత్తలు సమాచార విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దానితో పాటు సామాన్యుడి అవసరాల మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా రైతులు మరియు మెరుగైన పాలన అవసరాల మీద దృష్టి కేంద్రీకరించాలని ఆకాంక్షిస్తున్నాను.
వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో ఉపగ్రహాల నుంచి పొందిన సమాచారం ఎంతో ఉపయోగపడుతోంది. అది అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది.దేశాభివృద్ధికి గ్రామీణాభివృద్ధి కీలకమైంది. జాతీయ పథకాల అమలులో వనరుల గురించి విశ్లేషణ, పర్యవేక్షణ, ప్రభావం అంచనా వేయడంలో ఉపగ్రహాలు అందించే సమాచారం ఎంతో అవసరం. ఎంజిఎన్ఆర్ఇజిఎ కింద 3.68 కోట్లతో రూపొందించిన భువన్ జియో పోర్టల్, జియో ట్యాగింగు విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.NRSC ద్వారా కార్టోసాట్ శాటిలైట్ సమాచారం 100 సేద్య ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతుందని నేను గతంలో చెప్పాను. కాలానుగుణంగా వర్షపాతం మరియు భూగర్భ జల అవకాశాలపై ఉపగ్రహ సమాచారం సేకరింది. దీని ద్వారా గ్రాణీ నీటి అవసరాల కోసం పథకాల నిర్వహణ సులభతరమైంది.

కిసాన్ సించాయ్ యోజన కింద వాటర్ షెడ్ డెవలప్ మెంట్ కాంపోనెంట్ ద్వారా నీటి పరిరక్షణ మరియు నీటి నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోంది. NRSC చేస్తున్న ప్రధాన ప్రయత్నాలు వివిధ పంట వ్యవస్థలు, కరువు పరిస్థితుల విశ్లేషణ, పంటల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడానికి సాయపడతాయి.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రత్యేకించి పేదల విషయంలో, 500 నగరాల్లో ప్రాథమిక సదుపాయాలు అందించడం మరియు పట్టణ రవాణాను మెరుగు పరిచేందుకు అవసరమైన అమృత్ పథకానికి హైరిజల్యూషన్ తో ఉపగ్రహ సమాచారం వినియోగించడం ఆనందంగా ఉంది.
అసంఖ్యాక విజయాలతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఇస్రోను అభినందిస్తూ, సామాజిక ప్రయోజనాల కోసం భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అనేక ప్రయోజనాల కోసం ఉపగ్రహ చిత్రాల వెబ్ ఆధారిత విశ్లేషణను అందించే ప్రయత్నం చేయాలి.సుదీర్ఘకాలంలో సమాచార పునరుద్ధరణ విషయంలో సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయండి. మీ నైపుణ్యం ఇప్పటికే కొన్ని నదుల మీద సానుకూలమైన అధ్యయనం ఎన్నో విశేషాలను తెలియజేసింది.ఈ మధ్యే కేరళ వరద విపత్తును చూశాం. ఇలాంటివి రాకుండా NRSC నుంచి ఇస్రో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ సమాచారాన్ని ముందుగా అన్ని విభాగాలకు అందజేయాలి. దీని ద్వారా నదుల విషయంలో ప్రణాళిక రచన చేసేందుకు ఆయా విభాగాలకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది.వాతావరణ సమాచారానికి వినియోగించే అన్ని రకాల ఉపగ్రహాలను, ఇమేజింగ్ సెన్సార్ ఉన్న మానవ రహిత ప్రయోగాలను ఇస్రో చేపట్టాలి. విపత్తు ప్రమాదాల విషయంలో కచ్చితమైన సమాచారం అందించేందుకు దేశ వ్యాప్తంగా కొండ ప్రాంతాల్లో అనుసంధానిత వ్యవస్థ ఉండాలని భావిస్తున్నాను. ఇస్రో దీని విషయంలో దృష్టి పెడుతుందని బావిస్తున్నాను. NRSC సమాచారం అటవీ నిర్వహణలో బాగా ఉపయోగపడుతున్నప్పటికీ మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం అవసరం.గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల దృష్ట్యా NRSC లాంటి సంస్థలు సముద్ర వాతావరణ అధ్యయనం మీద దృష్టి పెట్టాలి. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే వాతావరణ అంచనాల కోసం భారత ఉపగ్రహ వినియోగాన్ని మరింత విస్తృతం చేయవలసిన అవసరం ఉంది.పౌరసేవల కోసం కూడా NRSC సమాచారం అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నైపుణ్యం, సామర్థ్యం ఆధారంగా NRSC మరిన్ని ప్రయత్నాలు చేస్తుందని విశ్వసిస్తున్నాను.భారీ లిఫ్ట్ లాంచర్లు, మానవ అంతరిక్ష వాహక ప్రాజెక్టులు, పునర్వినియోగ ప్రయోగ వాహనాలు, సెమీ క్రయోజెనిక్ ఇంజన్లు, అంతరిక్ష అనువర్తనాలకు మిశ్రమ పదార్థాల అభివృద్ధి మరియు ఉపయోగం వంటి వాటి విషయంలో ISRO భవిష్యత్తు ప్రణాళికలు కీలకమని భావిస్తున్నాను. ఈ ఏడాది 12 ప్రయోగాలు చేయనుంది.ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ మరియు అతని బృందానికి అభినందనలు. మీరు చేయబోతున్న 12 ప్రయోగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను”.