శిష్యురాలిపై బాబా లైంగిక దాడి.

దిల్లీ:
దక్షిణ దిల్లీ ప్రాంతంలోని ఫతేపూర్‌ బేరికి చెందిన దాతి మహారాజ్‌ అనే బాబాపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. తనను తాను అవతార పురుషుడిగా చెప్పుకుంటోన్న ఈయనపై ఆదివారం అర్థరాత్రి కేసు నమోదైంది. కేసు తీవ్రత నిమిత్తం జిల్లా విచారణ విభాగానికి (డీఐయూ) దీన్ని బదిలీ చేశారు.దాతి మహారాజ్‌పై భారతీయ శిక్షా స్మృతిలోని 376,377,354,34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.దీనిపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ…‘ దాతి మహారాజ్‌ బాబా తనను రెండేళ్ల క్రితం అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. బాబాకు, అతని అనుచరులు భయపడి ఇన్ని రోజులు ఈ విషయం వేరే వాళ్లతో చెప్పడానికి భయపడ్డానని చెప్పింది. మళ్లీ బాబా ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాని పేర్కొంది.’ అని తెలిపారు.గత కొన్నేళ్లుగా ఆమె బాబాకు శిష్యురాలిగా ఉండేది. దాతి మహారాజ్‌కు భారీసంఖ్యలో భక్తగణం ఉంది. శనిధామ్‌ పేరిట ఆయన ఆశ్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆయన చెప్పే ధర్మ సూక్తులు వినేందుకు వేలాదిమంది భక్తులు హాజరవుతుండటం విశేషం.