‘శృంగారవేదిక’గా సామాజిక సైట్లు. అశ్లీల దృశ్యాలతో పెరుగుతున్న ‘ కిక్కు’.

ఎస్.కే. జకీర్.
ఇంటర్నెట్ ప్రపంచాన్ని గుప్పిట్లో ఉంచిందని సంబరపడ్డాము.సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎక్కడెక్కడివారితోనో సంబంధాలను ఏర్పడేలా
చేసిందని మురిసిపోయాము. కానీ ఇప్పుడు ఆసైట్లు అశ్లీల చిత్రాలతో నిండిపోతున్నాయి. సామాజిక సంబంధాలకు వేదికలుగా నిలిచిన సోషల్ నెట్వర్క్ సైట్లు ఆకతాయిల ఆగడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మారుతున్నాయి. వారి ఆగడాలకు వెబ్ సైట్లు అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతున్నాయి? ఎంతకాలం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు ఈ ఆకతాయిలు ? వ్యాపార ధోరణిలోనే ప్రవర్తిస్తే నెటిజన్ల వ్యక్తిగత సమాచారానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో భద్రతేది ? సామాజిక సంబంధాలను మెరుగుపర్చడం కోసం ఏర్పాటైన సోషల్ నెట్ వర్క్ సైట్లకు బాధ్యత లేదా? ఉంటే ఎంతవరకు నిర్వహిస్తుంది. ? సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మనదేశ చట్టాలు ఇస్తున్న భరోసా ఏమిటి ? చట్టాలను కఠినతరం చేస్తే సరిపోతుందా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ల కు కఠిన నిబంధనలు ఉండవా? ‘ఫేస్ బుక్’ , ‘ఆర్కుట్’, ‘ట్విట్టర్’ లే కాదు కుప్పలు తెప్పలుగా సోషల్ నెట్ వర్క్ సైట్లు పుట్టుకొచ్చాయి. అన్నింటి లక్ష్యమూ ఒకటే. సామాజిక సంబంధాలను మెరుగుపర్చడం. వ్యక్తిగత ప్రొఫైల్‌ను ఏర్పరచుకొని, ఇతర
వాడుకదారులను స్నేహితులుగా చేసుకొని మెసేజ్ లను పంపించుకోవచ్చు. వారి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయగానే ఆటోమెటిక్‌గా సమాచారంను ప్రొఫైల్ లో ఉన్న స్నేహితులందరికీ చేరిపోతుంది. అంతేకాకుండా, వినియోగదారులు వారికి ఆసక్త ఉన్న సమూహాలలో చేరవచ్చు, ఎక్కడెక్కడివారితోనూ సంబంధాలను కలపగలిగింది.తద్వారా ప్రపంచం చిన్నదైపోయింది అందరికీ. 2004 సంవత్సరంలో జకర్ బర్గ్అతని స్నేహితుల మధ్య సంబంధాలను పెంచుకోవడం కోసం ‘ఫేస్ బుక్’ ను రూపొందించారు. 2006 లో ‘జాక్ డోర్సీ’ ఇదే ఉద్దేశంతోనే ‘ట్విట్టర్స్’ సోషల్
నెట్ వర్కింగ్ సైట్ ను తీర్చిదిద్దారు. ఇదిలా ఉంటే ‘గూగుల్’, ‘ఆర్కుట్’ ఇంకా చాలా సైట్లు కుప్పలు కుప్పలుగా తయారయ్యాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇప్పటికి వంద కోట్ల మంది యూజర్లున్నారంటే నమ్ముతారా! కానీ అక్షరాల నిజం. అంతగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు నెటిజన్లకు నచ్చేశాయి. సోషల్ నెట్ వర్క్ సైట్లు ఎంతగా ఉపయోగించుకుంటున్నారంటే డ్యూటీలో ఉన్నా ఫేస్ బుక్ ,ఇంటికెళ్లినా ఫేస్ బుక్. ఇంకా ట్విట్టర్ గురించి చెప్పాలంటే వీఐపీల కబుర్లు, గాసిప్స్ ఒక్కటేమిటీ అంతే అందరూ ట్విట్టర్ లో ఖాతాదారులే. సోషల్ నెట్ వర్క్ సైట్లు రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి. సాంఘిక నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో ఖాతాదారుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోవడంతో వారిని ఎట్రాక్ట్ చేయడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అశ్లీల చిత్రాల ప్రదర్శన ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ సైట్లలో ఉన్న వినియోగదారుల వ్యక్తిగత ప్రొఫెళ్లలో అన్నీ అశ్లీల చిత్రాలు , అశ్లీల వీడియోలే దర్శనమిస్తున్నాయి. వీటిని ఎంజాయ్ చేసేవారు కొంతమంది ఉన్నప్పటికీ మరెంతోమంది ఫేస్ బుక్, ట్విట్టర్ వినియోగారులు ఇబ్బందులకు గురవుతున్నారు.కానీ వీటిని అరికట్టడానికి మాత్రం ఆయా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మాత్రం ఏమాత్రం ప్రయత్నించకపోవడం బాధాకరం. ‘ఫేస్ బుక్’ ప్రారంభమైన కొత్తలో ఎప్పుడో దూరమైన స్నేహితుడు ఫేస్బుక్ ద్వారా దగ్గరయ్యాడని కొందరు అభిప్రాయపడితే మనసుకు ఊరటనిచ్చే స్నేహితుడు పరిచయమయ్యాడని మరికొందరు సంతోషాలను వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ సంబంధాలను మెరుగుపరిచే ఏకైక సాధనమని నిపుణులు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. విపరీత ధోరణిలో ఆలోచిస్తున్న యువత వారి ఆలోచనలను ఫేస్ బుక్ లో ప్రదర్శిస్తున్నారు. అసభ్యకర సందేశాలు, అసభ్యకర చిత్రాలు, అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇంకొంచెం ముందుకు ఆలోచించిన యువత నేర్చుకున్న ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించడం మానేసి చెడుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అమ్మాయిల వ్యక్తిగత ప్రొఫెళ్లలోకి ప్రవేశించి వారి చిత్రాలను మార్ఫింగ్ చేసి వారి స్నేహితులందరికీ కనపడేలా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అమ్మాయిలు తలెత్తుకోలేని పరిస్థితిలో బతుకుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది యువత
ఏకంగా అమ్మాయిలను ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుని కళ్లబొల్లి మాటలు చెప్పి ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తరువాత వారి ఫోటోలను అసభ్యకరంగా తయారుచేసి పోస్ట్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. చేసేది లేక వారిలో వారే కుంగిపోతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అమ్మాయిలైతే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం.సామాజిక సంబంధాల వేదిక ‘ఫేస్ బుక్’ కు ప్రస్తుతం ‘నగ్నచిత్రాల’ చీడ సోకింది. మహిళల నగ్నచిత్రాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా నగ్నచిత్రాల పేరుతో ఎకౌంట్లను కొంతమంది తెరుస్తున్నారు. వెరీ హాట్ ఇండియన్ ఆంటీ, దేశీ బ్యూటిఫుల్ ఆంటీస్ , బ్యూటిఫుల్ ఉమెన్ , అట్రాక్టివ్ లేడీ , దేశీ గర్ల్స్ అంటూ వివిధ రకాలు గా ఎకౌంట్లను తెరుస్తున్నారు. ఇలా ఎకౌంట్లు తెరుస్తున్నవారంతా యువతను ఎట్రాక్ట్ చేయడం కోసం చేస్తున్నారు. మహిళల అసభ్య చిత్రాలు ఇక్కడ ఉంటాయి. దీని కోసం ఎంతో మంది వివిధ రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు. యువతను ఆకర్షించడంలో భాగంగా చేస్తున్న వీరంతా
హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును వెర్రెక్కిస్తున్నారు. శృంగార దృశ్యాలున్న వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు.