షామ్ పిట్రోడా తో టీపీసీసీ ఐ.టి.సెల్. చైర్మన్ మదన్.

న్యూఢిల్లీ:
భారత టెలికాం రంగానికి పితామహుడుగా పేరు పొందిన శ్యామ్ పిట్రోడాతో టీపీసీసీ ఐ.టి.సెల్ చైర్మన్,’చార్మ్స్’ రూపకర్త కె.మదన్ శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ సమావేశం జరిగినట్టు మదన్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ అధునాతన సాంకేతిక విధానాలను, సాంకేతికంగా వస్తున్న ప్రయోగాలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. త్వరలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మదన్ చెప్పారు.