సంక్షేమమే కేసీఆర్ కు శ్రీరామరక్ష.

ఆర్.ఆదిరెడ్డి.
దక్షత, ప్రగతి పట్ల దీక్ష, ప్రజల అభ్యున్నతి కేసీఆర్‌కు శ్రీరామరక్ష. తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేని ఆధిక్యం తథ్యమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. సుస్థిర పాలనను, నీతిమంతమైన పాలనను అందిస్తున్న కేసీఆర్‌కు ప్రజల సహాయసహకారాలు ఇకముందు కూడా ఎంతో అవసరమని, ప్రతిపక్షాల మాటలు, వ్యాఖ్యానాలపై దృష్టిపెట్టకుండా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ పాలన మనకు అద్దంలో బొమ్మలా స్పష్టంగా కనిపిస్తోంది కదా! దేశ రాజకీయవ్యవస్థలో గుణాత్మకమైన ఆలోచన విధానాన్ని రేకేత్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా తనకంటూ ఒక ప్రత్యేకతను ని రూపించుకునేలా ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రవే శపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకలుగా అంది స్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశం లోని అన్ని పార్టీల రాజకీయ నాయకుల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేలా ఆలోచనలు చేస్తున్న వ్యక్తుల్లో కేసీఆర్ ముందువరుసలో ఉన్నారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో దేశంలోనే నెంబర్ వన్. ఇ ప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారు. సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగం. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చే సేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం 1.24లక్షల రైతులకు 24గంటల ఉచిత కరెంట్‌ను ఇవ్వడం దేశంలో ఎవరితరం కాలేదు. కేసిఆర్ ఒక్కరే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుని అమలు చేసి నిరూపించడం ఇ ది దేశానికి ఆదర్శంగా నిలవడం చారిత్రాత్మకమైన నిర్ణయం. వ్యవసాయంపై దేశ ప్రజలు 65శాతం ఆధా రపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసే శక్తి ఒక వ్యవసాయరంగానికే ఉంటుందని చెప్ప వచ్చు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వ్యవ సాయ పురోభివృద్ధితోనే పరిశ్రమలు తమ ఉత్పత్తులను పెంచుకోగలిగే స్థాయికి ఎదగగలుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యంగా కాకతీయుల కాలంనాటి వ్యవసాయ విధానాన్ని ఆధునిక కాలంలో నిరూపించగలిగే శక్తి కేసీఆర్ ఒక్క రికే ఉంది. వ్యవసాయానికి ప్రధానమైన ఆధారంచె రువులని గుర్తించిన నాటి కాకతీయ రాజులను ఆద ర్శంగా తీసుకుని నాడు తవ్వించిన చెరువులను పున రుద్ధరణ పేరుతో మిషన్ కాకతీయ పేరిట గొలుసు కట్టు చెరువులను రాష్ట్రవ్యాప్తంగా 4 వేల చెరువులను పూడికతీసి తిరిగి పాత పద్ధతిలో ఉండేలా కాకతీయులు నిర్మించిన చెరువుకట్టలను బలోపేతం చేసి నీటి నిల్వలను పెంచుటకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది.