‘సన్యాసం’ విరమణ.కేటీఆర్ తో ‘సోమారపు’ రాజీ.

హైదరాబాద్:
రాజకీయ సన్యాసం తీసుకుంటానన్ననిర్ణయాన్న రామగుండం ఎమ్మెల్యే,ఆర్టీసి చైర్మన్ సోమరపు సత్యనారాయణ ఉపసంహరించుకున్నారు.తన నిర్ణయాన్ని విరమించుకోవాలని సోమరపు సత్యనారాయణ ను కేటీఆర్ కోరారు.
” మీలాంటి సీనియర్ నేత పార్టీ కి అవసరం “అంటూ సోమరపుని కోరారు.అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో రాజకీయ సన్యాసం ప్రకటన చేశారని,పార్టీ ని విమర్శించని గొప్ప వ్యక్తి సోమరపు సత్యనారాయణ అని కేటీఆర్ అన్నారు.కేటీఆర్ అభ్యర్థనతో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సోమారపు తెలిపారు.స్థానికంగా పార్టీలో అలజడి కారణంతో ఈ వయసులో రాజకీయాలు వద్దనుకున్నానని సోమరపు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ తపన పడుతున్నారని చెప్పారు.కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కి ఒక సివిల్ ఇంజనీర్ అని కూడా సోమారపు సత్యనారాయణ పొగిడారు.