సమరమా!సభ్యత్వమా? టీకాంగ్రెస్ కు ‘ఆధిపత్య’క్యాన్సర్.

ప్రతిపక్షంలో ఉన్నా ‘అధికారంలో’ఉన్నట్లే వ్యవహరించడం శతాధిక కాంగ్రెస్ పార్టీ ‘డి.ఎన్.ఏ’లోనేఉన్నది.అధికారం లేకుండా ఒక్క క్షణం ఉండలేరు.అంతగాఉక్కబోస్తుంది.ఊపిరాడదు.అందుకేఅర్జంటుగా అధికారంలోకి రావాలన్న ఆరాటం.ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ.కెసిఆర్ వంటి మహా పర్వతాన్ని కూల్చకుండా అధికారంలోకి ఎలా రాగలమనే చిన్న ‘లాజిక్కు’ను కూడా మరచిపోతున్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిబ్బరంగాఉండాలి.సహనంతోఉండాలి.అధికారపార్టీ తో పోరాటానికి నిబద్దతకావాలి.సరైన ఆచరణ ఉంటేనే కోల్పోయిన ప్రజల ఆదరణను ఇటుక,ఇటుకగాపునర్నిర్మించుకోవలసి  ఉంటుంది. ‘అధికారపక్షంకోనేస్తున్నది.మనమేంచేయలేం’అనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుశాతొలినాళ్లలోపార్టీహైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. అధికారం రాకపోయినా ‘ గౌరవప్రదంగా నే’21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సంగతిని ఆ పార్టీ నాయకులే మరచిపోతున్నారు.టిఆర్ఎస్ వేట కు కొందరు శాసనసభ్యులు,ఎం.ఎల్.సి లు జారిపోవచ్చును.ఉపఎన్నికల్లో,జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో ఘోరపరాజయాలు చవిచూసిఉండవచ్చును.ప్రదిష్ట అడుగంటి ఉండవచ్చును.కానీ మళ్ళీ ఆ ప్రతిష్టను పునరుద్ధరించుకోవచ్చు.ఇందుకుకావలసినదిఐక్యత,క్రమశిక్షణ,ఓపిక. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూనే, ఓటు బ్యాంకులను తయారు చేసుకుంటూనే ప్రతిపక్షం వలె నిరంతరం ‘ప్లానింగ్’ చేస్తున్నారు.

హైదరాబాద్;
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులుకోమటిరెడ్డివెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలనుపునరుద్దరించకపోతేఏమవుతుంది?పునరుద్ధరిస్తేఏమి జరుగుతుంది? కాంగ్రెస్ శాసనసభ్యుల పట్లటిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కొత్తగా ఏమీలేదు. వింతగానూలేదు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు చాలా సార్లు అసెంబ్లీలో,బయటా నెత్తీ నోరు బాదుకున్నా ఫలితంలేదు.కాంగ్రెస్ నాయకుల భాషలోనే చెప్పాలంటే ప్రభుత్వంఅప్రజాస్వామికంగా,నిరంకుశంగా,నియంతృత్వంగానేవ్యవహరిస్తున్నది. అందుకు కాంగ్రెస్ ఏమి చేయవలసి ఉంటుంది?సామరస్యంగా మంతనాలు జరపాలా ? విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడితే సరిపోతుందా?సమరంచేయాలా?సమరానికిపార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయవలసి ఉంటుందా?కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సభ్యత్వాలను పునరుద్ధరించాలని తీర్పు చెప్పింది.న్యాయ స్థానాల్లో నైతికంగా గెలిచినట్లే కదా !మరి ఆ ఇద్దరి శాసనసభ్యత్వాలనుపునరుద్ధరించాలనిసిఎల్పీ నాయకుడు జానారెడ్డి,టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేయడం వల్ల ప్రయోజనమేమిటి? కాంగ్రెస్ నాయకుల వాదన ప్రకారం,హైకోర్టుతీర్పుప్రకారంఇద్దరు ఎం.ఎల్.ఏ ల శాసనసభ్యత్వాలను అన్యాయంగా రద్దు చేశారని అనుకుందాం.కోర్టు తీర్పు అమలు చేయకపోతే ఏమవుతుంది?కోమటిరెడ్డి, సంపత్ ల ‘బహిష్కరణ’ వంటి వజ్రాయుధం దొరికితే దాన్ని చేతబట్టి కత్తీ,డాలూ తీసుకొని,ఊరూ వాడా ఏకం చేయవలసిన వ్యూహాలు లేవు. జాతీయస్థాయిలో కెసిఆర్ ప్రభుత్వ‘అప్రజాస్వామిక’ వైఖరిని ఎండగట్టవలసిన ఎత్తుగడలులేవు.ముఖ్యమంత్రి కెసిఆర్ కు ‘అప్రియమైన’ నిర్ణయం స్పీకర్ తీసుకోగలరని ఎవరైనా నమ్ముతున్నారా?స్పీకర్ తన ‘విచక్షాణాధికారాలు’ ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టించిన ఘటనలు గతంలో ఎన్నడైనాజరిగాయా?పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పై ఫిర్యాదులను ఏళ్ల తరబడి పరిష్కరించకుండా,తీర్పు ఇవ్వకుండా కాలయాపన చేసిన స్పీకర్ ల ఉదంతాలు ఎన్నో చూశాం. ఇప్పుడు హైకోర్టు తీర్పు వ్యవహారం కూడా దాదాపు అలాగే ఉండవచ్చు. ఉండకపోవచ్చును.ప్రభుత్వం దీనిపై స్పందించదు.స్పీకర్ తనకు సంక్రమించిన‘అధికారాల’తో ఏమీ తేల్చకపోవచ్చును.ప్రతిపక్షంఏమి చేయవలసి ఉంటుంది? కాంగ్రెస్ నాయకులే చెబుతున్నట్టు ఇద్దరు ఎం.ఎల్.ఏల‘బహిష్కరణ’ చట్ట విరుద్దం అయినప్పుడు అధికారపక్షం పై ఎలాంటి పోరాటాలు జరపాలి?ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పూనుకోవాలి?ఎలాంటిఉద్యమాలను నిర్మించాలి?అసెంబ్లీలో, కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, షబ్బీర్ అలీ తమ ‘హోదా’ ను విడిచిపెట్టి ప్రభుత్వానికి నిరసన ఎందుకు తెలియజేయలేదు?ఆ హోదా విడిచిపెట్టడం పెద్ద త్యాగమేమీ కాదు.కాన్వాయ్,హంగూ,ఆర్భాటమూఉండదు.పైలట్ వాహనం ఉండదు. సెక్యూరిటీతగ్గవచ్చు. అయితేఏమవుతుంది?ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభద్రతకు అవకాశాలు చాలా తక్కువ.ప్రత్యర్థుల నుంచి దాడులకు చోటు లేదు. పబ్లిక్అకౌంట్స్ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేసి నిరసనప్రకటించలేదు. ఇవన్నీచిన్న,చిన్న‘త్యాగాలే’.కానీకాంగ్రెస్ నాయకులకు ఇది నచ్చని అంశం. పదవులువదులుకోవడం,ఆయా పదవుల ద్వారాప్రభుత్వం నుంచి సంక్రమించే అధికారం వదులుకోవడం కాంగ్రెస్ నాయకులకు రుచించనిది.ప్రతిపక్షంలో ఉన్నా ‘అధికారంలో’ఉన్నట్లే వ్యవహరించడం శతాధిక కాంగ్రెస్ పార్టీ ‘డి.ఎన్.ఏ’లోనేఉన్నది.అధికారం లేకుండా ఒక్క క్షణం ఉండలేరు.అంతగాఉక్కబోస్తుంది.ఊపిరాడదు.అందుకేఅర్జంటుగా అధికారంలోకి రావాలన్న ఆరాటం.ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ.కెసిఆర్ వంటి మహా పర్వతాన్ని కూల్చకుండా అధికారంలోకి ఎలా రాగలమనే చిన్న ‘లాజిక్కు’ను కూడా మరచిపోతున్నారు.జానారెడ్డి అంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డికి పోసగదు.ఉత్తం కుమార్ రెడ్డికి,కోమటిరెడ్డి బ్రదర్స్ కు పొసగదు.ఉత్తమ్ కుమార్ రెడ్డిని‘అత్యవసరంగా’ పిసిసి పదవి నుంచి దింపాలని కొంతమంది ఎజండా.జానారెడ్డినిసిఎల్పీ పదవి నుంచి తప్పించాలని మరికొందరిఎజండా.మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరరాజనరసింహ ది వేరే ‘స్కూలు’.మల్లుభట్టివిక్రమార్కది మరో రూటు.ఎవరిమధ్యాఐక్యతలేదు. కొందరునాయకులది ఒంటెత్తు పోకడలు. మరికొందరు తామే మేధావులమని భావించే వారు. నా మాట వినడం లేదని డి.కె.అరుణఅప్పుడప్పుడూఅలక.నాగం జనార్ధనరెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవడాన్ని ఆమె తప్పు బడుతున్నారు.నాగర్ కర్నూల్ కు చెందిన కాంగ్రెస్ఎం.ఎల్.సి.దామోదరరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించడం కాంగ్రెస్ కు భారీ నష్టమని డి.కె.అంచనా. తెలుగుదేశం పార్టీ ‘ఫైర్ బ్రాండ్’ రేవంత్ రెడ్డి చేరికమరికొంతమందికి ఇష్టం లేదు.ఆయన‘స్పీడు’ నచ్చని వ్యక్తులు డిల్లీకి ఫిర్యాదు చేస్తున్నారు. నాగం ను ఓడించడం తన లక్ష్యమని డి.కె.అరుణ కొందరు మీడియా ప్రతినిధుల దగ్గర ప్రతిజ్ఞ చేశారని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోచేరినవాళ్ళు పోను మిగిలిన వాళ్ళు ఎంతమంది?వచ్చే ఎన్నికల్లో 70,80 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడానికి తగిన వ్యూహం ఏమిటి? నాగం,రేవంత్ వంటి నాయకులను చేర్చుకునే ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలాంటి కసరత్తు జరపలేదనుకునేవారిధి అమాయకత్వమే అవుతుంది. కాంగ్రెస్లో ఉంటూ పరోక్షంగా,ప్రత్యక్షంగా టిఆర్ఎస్ కు ప్రయోజనం కలిగే చర్యలకు పాల్పడుతున్నవారు,సమాచారాన్ని చేరవేసేవారికి సంబంధించి రాహుల్ గాంధీ దగ్గర పూర్తి సమాచారం ఉంది.ఎవరివల్ల పార్టీ బలోపేతం కాగలదో, రాజేలేని ధోరణిలో ఎవరు కెసిఆర్ ను డీకొనగలరో ఆయనకుతెలుసు.కాంగ్రెస్ నాయకులు కొందరు టిఆర్ఎస్ నాయకులతోగతంలో‘బేరసారాలు’ జరిపారు.నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం,ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిఅడ్డుపడడటంబహిరంగరహస్యం. ఇంకా కొందరు నాయకులు కూడా ఎన్నికల నాటికి అధికారపార్టీ లోకి ‘జంప్’ చేయరన్న భరోసా ఎవరూ ఇవ్వలేరు.తమ పార్టీ అధికారంలోకి వస్తుందో,రాదో అనే అనుమానాల మధ్య ఇలాంటి ఫిరాయింపులు జరగవచ్చును.వాళ్ళను ముందస్తుగా కనుగోనడమూకష్టమే. ఫిరాయించకుండానిలువరించడమూ కష్టమే.దళితుడు,ఉన్నతవిద్యావంతుడు,పారిశ్రామికవేత్త, మీడియా సంస్థల అధిపతిఅయినడాక్టర్జి. వివేక్ ను నిలువరించలేకపోయారు.పిసిసి అధ్యక్షుడుగా చాలా కాలం పనిచేసిన,సీనియర్ నాయకుడు, బలహీనవర్గాలకు చెందిన డి.శ్రీనివాస్ ను ఆపలేకపోయారు.పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిదీ అదేస్టోరీ.కాంగ్రెస్ నాయకులకు ‘ఇన్స్టంట్’ పదవులు,లేదా ఇతరత్రా ప్రయోజనాలు కావాలి. తెలంగాణ రాష్ట్రసమితిలో ‘ప్రజాస్వామిక’ వాతావరణం ఎలా ఉంటుందో, ‘ఆత్మగౌరవం’ ఎలా ఉంటుందో సంపూర్ణంగా‘అవగాహన’ ఉన్నవారు కూడా అధికారపక్షం వైపునకువెళ్ళడం అంటే ‘ఇన్స్టంట్’ ఫలితాలు ఏమైనా ఉండవచ్చును. లేదా కెసిఆర్ ను తాము డీకొనలేమన్ననిర్ణయానికి అయినా వచ్చి ఉండాలి.కెసిఆర్తో తలపడడానికి ‘సంకల్ప శుద్ధి’ లేకపోవడంకూడాకారణమే.కనుక రాహుల్ గాంధీ నిర్ణయాలను వ్యతిరేకించే పనులు మానుకొని అధికారపక్షంతో ఎలా తలపడాలో, నియోజకవర్గాలవారీగా బలాబలాలేమిటో అంచనా వేసుకొని, విశ్లేషించుకొని సమర్ధులైన అభ్యర్థులను తయారుచేసుకోవడం,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి శక్తివంతంగాతీసుకువెళ్ళడానికి గాను చేపట్టవలసిన చర్యలపై ద్రుష్టిపెట్టవలసిఉంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిబ్బరంగాఉండాలి. సహనంతోఉండాలి. అధికారపార్టీ తో పోరాటానికి నిబద్దతకావాలి. సరైన ఆచరణ ఉంటేనే కోల్పోయిన ప్రజల ఆదరణను ఇటుక,ఇటుకగాపునర్నిర్మించుకోవలసి ఉంటుంది. ‘అధికారపక్షంకోనేస్తున్నది.మనమేంచేయలేం’అనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుశాతొలినాళ్లలోపార్టీహైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. అధికారం రాకపోయినా ‘ గౌరవప్రదంగా నే’21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సంగతిని ఆ పార్టీ నాయకులే మరచిపోతున్నారు.టిఆర్ఎస్ వేట కు కొందరు శాసనసభ్యులు,ఎం.ఎల్.సి లు జారిపోవచ్చును. ఉపఎన్నికల్లో,జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో ఘోరపరాజయాలు చవిచూసిఉండవచ్చును.ప్రదిష్ట అడుగంటి ఉండవచ్చును. కానీ మళ్ళీ ఆ ప్రతిష్టను పునరుద్ధరించుకోవచ్చు. ఇందుకుకావలసినదిఐక్యత,క్రమశిక్షణ,ఓపిక. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూనే, ఓటు బ్యాంకులను తయారు చేసుకుంటూనే ప్రతిపక్షం వలె నిరంతరం ‘ప్లానింగ్’ చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా రాజకీయశిక్షణశిబిరాలను ఆయన నడపనున్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిననాయకులు,ముఖ్య కార్యకర్తలతో భద్రాచలంలో రాజకీయశిక్షణ శిబిరాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయవంతంగానిర్వహించారు. ఇలాంటి శిబిరాలను ఇక అంతటా కెసిఆర్ ఉదృతంచేయవచ్చును.మళ్ళీ అధికారంలోకి రావడం కెసిఆర్ ఎజండా. కెసిఆర్ ను గద్దె దింపడం కాంగ్రెస్ కు ఎజండాఅయినపుడు అందుకు తగ్గ ఏర్పాట్లు,సన్నాహాలుఏవి?కార్యకర్తల్లో ఉత్తేజం నింపే చర్యలు ఏవి?బస్సు యాత్రలతో తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటున్నదనే వాతావరణం ఏర్పడడం పట్ల రాహుల్ గాంధీఅభినందించారు. అయితే ఇదొక్కటే చాలదు.ఇంకా శ్రమ పడాలి. ముఖ్యమంత్రి ఎవరు!అనేమీమాంస నుంచి కాంగ్రెస్ నాయకులు తక్షణం విముక్తి కావాలి.కార్యక్రమాలుఏవైనా కావచ్చు.కేసిఆర్ పాలన ప్రజల్లోకి వెళ్ళింది. ఆ పాలనపై కొన్ని సెక్షన్ల ప్రజలకు వ్యతిరేకత ఉన్నా ఇప్పుడే వారు బహిరంగంగావెల్లడించకపోవచ్చు. ‘టిఆర్ఎస్ నుతొందరగా వదిలించుకోవాలి’అనే మైండ్ సెట్ ప్రజల్లో లేనప్పుడు, నెగెటివ్ఓటుపై ఆశలు పెట్టుకోవడం అడియాసే అవుతుంది.