సమ్మెలో పాల్గొంటే బర్తరఫ్. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హెచ్చరిక.

హైదరాబాద్:
సమ్మెలో పాల్గోంటే తక్షణమే ఉద్యోగాలనుంచి తొలగించాల్సివస్తుందని, ఉద్యోగాలు పొగొట్టకున్న కార్మికులు మాత్రమే సమ్మెకు దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం
స్పష్టం చేశారు. ఆర్టీసీలో సమ్మె చేయడాన్ని నిషేధించినా కొందరు తమ స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇవ్వడంలోని ఔచిత్యాన్ని ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, యూనియన్ నాయకులు మొత్తం ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారని, నాయకుల మాట విని కార్మికులు మోసపోవద్దని, . ప్రభుత్వాన్ని అర్ధం చేసుకుని సమ్మెలో పాల్గొనదలుచుకోని వారు వారి నిర్ణయాన్ని యాజమాన్యానికి తెలియచేయాలని సిఎం సూచించారు. సమ్మెకంటూ పోతే టీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని, తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలని, కేవలం 53 వేల ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని, యావత్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సమ్మె అన్న ఆలోచనే ఆత్మహత్య సదృశం అని, ఈ విషయాలన్నీ ఉద్యోగులు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు

ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో రూ.3000 కోట్ల అప్పుతో, ర.250 కోట్ల అపప్పుపై వడ్డీతో , సాలీనా రూ.700 కోట్ల నష్టంతో మనుగడ సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్త ఉద్యోగులు సమ్మెకు నోటీసివ్వడం అసమంజసమని, అసంబద్దమని,బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆర్టీసీ యూనియన్లు అస్తవ్యస్తమైన డిమాండ్లతో సమ్మె చేస్తామని నోటీసిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటుచేయాల్సిన ప్రత్యమ్నాయ ఏర్పాట్ల గురించి, డిమాండ్లు నెరవేర్చే విషయంలో సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,ఆర్దికశాఖా మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీ, డిజిపీ మహేందర్ రెడ్డి, సిఎంవో అధికారులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి, శాంతి కుమారి, రాజశేఖర్ రెడ్డి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

సమీక్షాసమావేశంలో సీఎం  మాట్లాడుతూ, ఒకసారి సమ్మెకు పోవడమంటూ జరిగితే ఇప్పుడున్న నష్టాలకు తోడు అధనంగా రోజుకు కోటిన్నర రూపాయలు నష్ట పోవాల్సి వస్తుందని, యూనియన్ నాయకుల అసమంజసమైన కోరికల వల్ల ఇప్పుడున్న నష్టాలకు  సాలీనా మరో రూ.900 కోట్లు అధనపు భారం ఆర్టీసీ యాజమాన్యం మీద పడుతుందని, ఈ నేపథ్యంలో సమ్మెకు పోయి కార్మికుల గొంతు కోసేదానికంటే సంస్థను ఎలా బలో పేతం చేసుకోవాలో యూనియన్ నాయకులు ఆలోచించాలని హితవు పలికారు.

లోగడ భారత దేశ చరిత్రలో ఏరాష్ట్రంలోనూ పెంచని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచి, భవిష్యత్తులో సంస్థను లాభాలలో నడిపించమని సూచించినప్పటికి ఇప్పటికీ ఫలితం కనిపించలేదని, సిఎం అన్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఆర్టీసీ ఉద్యోగులతో విస్త్రుత స్థాయి సమావేశం జరిపినపుడు మొత్తం 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, ఇప్పటికీ రెండేండ్ల తర్వాత ఏ మార్పూ రాలేదని అన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పోరేషన్లను ఎత్తివేయడమో, నామ మాత్రంగా నడపడమో, లేదా పునర్వవస్థీకరించడమో జరిగిందని, తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 7, ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారని, ఇదే పద్దతి తెలంగాణలో కూడా అవలంబించాల్సిన పరిస్తితులు రావచ్చని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రయివేట్ ట్రావెల్ ఏజెన్సీలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని, బస్సులు కొని, లాభాల్లో నడుపుతూ, బ్యాంకు రుణాలను కూడా తీరుస్తున్నారని, అలాంటప్పుడు యూనియన్ల అలసత్వం వలన ఆర్టీసీ నష్టాల్లో పోవడం సమంజసం కాదని, దాన్ని సమీక్ష చేసుకుని ఎలా లాభాల బాట పట్టాలో వాల్లు ఆలోచన చేయాలని సిఎం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే, యూనియన్ ఎన్నికలల్లో గెలవాలనే వొకే వొక కారణంతో, స్వార్ధ పూరితమైన ఆలోచనలతో అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికుల కుటుంబాలను ఇబ్బంది గురిచేసే ప్రయత్నం చేయడం సరికాదని సిఎం అన్నారు.