సమ్మె వద్దు.కేసీఆర్ తో చర్చలు ముద్దు. -మంత్రి మహేందర్ రెడ్డి.

హైదరాబాద్:
ఆర్టీసీ సమ్మె పిలుపును విరమించుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుర్తింపు కార్మిక సంఘం నేతలు అశ్వత్థామ రెడ్డి తదితరులతో  కలిసి,ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, అధికారులతో సంస్థ స్థితిగతుల మీద మంత్రి చర్చించినారు.సంస్థ నష్టాల ఉందని,విశాల ప్రయోజనం కోసం సమ్మె పై పునరాలోచించండని ఆయన కోరారు. సమ్మె విరమించండి, సబ్ కమిటీ తో చర్చించుకుందామని కోరారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడుకుందామని కూడా మహేందర్ రెడ్డి తెలిపారు.97 డిపోలలో  కేవలం 11  డిపోలు లాభాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. RTC కి సుమారు 3 వేల కోట్ల అప్పులు ఉన్నాయని,ఏటా వడ్డికి రూ. 250 కోట్లు కడుతున్నామని తెలిపారు. ఏటా RTC కి రూ. 700 కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. జీతాలు పెంచితే అధనంగా సంస్థ మీద రూ. 1400 కోట్ల భారం పడుతుందన్నారు.53 వేల మంది కార్మికులు ప్రయోజనం తో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల ప్రయోజనాలు కూడ ముఖ్యమని తెలిపారు.సంస్థను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని రవాణా మంత్రి అన్నారు. కార్మికులను తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దించటం సరికాదన్నారు. ఇప్పటికి సమ్మె మీద పునరాలోచించాలని కోరారు. కార్మిక నాయకులు ఎన్నికల కోసం ఆర్టీసీ కార్మికులను,సంస్థను నష్టం పోనియరాదని మంత్రి హితవు పలికారు.