సర్పంచ్ హత్య కేసులో నిందితుల లొంగుబాటు.

రాజన్న సిరిసిల్ల:
మూడపల్లి గ్రామ సర్పంచ్ గోలి శంకర్ హత్య కేసు నిందితులు మంగళవారం పోలీసులకు లొంగిపోయారూ. మే 13 రాత్రి 20.35 గం.ల ప్రాంతములోహన్మక్కపల్లె గ్రామ శివారులో మూడపల్లి గ్రామ సర్పంచ్ గోలి శంకర్ హత్యకు గురి అయినాడు. దీనికి సంబంధించి వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పరిచి పరిశోధన ప్రరంభించనైనది కేసు పరిశోధన కొనసాగుతున్న క్రమములో ఈ రోజు తేది 22-05-2018 ఉదయం పూట కడారి మహేందర్, నేదురి రాజేష్, బైరెడ్డి వినయ్, ఎడపల్లి విష్ణు అను వారులు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ నందు లొంగి పోయినారు విచారణ లో భాగముగా నేరస్తులను విచారించగా గోలి శంకర్ ను ఒక పథకం ప్రకారం హత్య చేసినట్లు వెల్లడైనది.

గత 8 సంవత్సరాల క్రితం కడారి తిరుపతి తన చెల్లెల్ని ముడపల్లి గ్రామస్తుడైన గోలి తిరుపతి కు ఇచ్చి వివాహము జరిపించినాడు గోలి తిరుపతి గోలి శంకర్ కు పాలివాడు, పెండ్లి అయిన కొద్ది రోజులకే గోలి తిరుపతి దుబైకి వెళ్లి పోయినాడు, గోలి శంకర్ కడారి తిరుపతికి బంధువు వరుసకు బావ అవుతాడు, ఆ చోరువతో గోలి శంకర్ తిరుపతి చెల్లెలితో చనువుగా ఉండేవాడు కడారి తిరుపతి అతని తమ్ముడు కడరి మహేందర్ గోలి శంకర్ పై అనుమానాలు పెంచుకొని తరుచు గోడువాలు పడే వారు అంటే కాకుండా కడారి తిరుపతి ప్రేమ పెండ్లి విషయములో కూడా గోలి శంకర్ జోక్యం చేసుకొని వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించి దాదాపు నెల రోజుల నుండి ఎలాగైనా గోలి శంకర్ ను అంతమొందించాలని తిరుపతి మరియు అతని తమ్ముడు మహేందర్ లు పథకం వేసుకున్నారు దాని అమలు భాద్యతను తమ్ముడికి అప్పగించి ఆ పథకంలో భాగంగానే కడరి తిరుపతి తన ఆరోగ్యం బాగుగా లేదని చికిత్స చేయించుకోవాలనే నెపం తో చికిత్స గురించి కేరళ వెళ్తున్నట్లు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో తేది 04-05-2018 రోజున ఒక లెటర్ ఇచ్చినాడు, ఆ మరుసటి రోజు మహేందర్ తన అన్న తిరుపతి ను హైదరాబాద్ లో దింపి వస్తు కూకట్పల్లి నిజాంపేట్ లో ౦౩ వేట కొడవళ్ళు కొనుక్కొని వేములవాడకు వచ్చి వాటిని ఓక బ్యాగ్ లో ఉంచి తన అనుచురులు అయిన శివ మరియు నిదురి రాజేష్ ల సహాయము తీసుకున్నాడు అంతకు ముందే ఆన్లయిన్ లో పెప్పర్ స్ప్రే ను తప్పుడు మెయిల్ ఐ డి తో కొనుగోలు చేసినాడు, వీటన్నిటిని రాజేష్ రూమ్ లో ఉంచి గోలిశంకర్ ను చంపుటకు సరియైన సమయం గురించి వేచి చూస్తున్నారు, ముందుగా అనుకున్న ప్రకారం గోలి శంకర్ ను చంపుట కొరకు కొన్ని ప్రాంతాలు ఎంపిక చేసుకున్నారు అవి 1). గోలి శంకర్ ఇంటి వద్ద కారును షెడ్ వద్ద పార్క్ చేసి ఇంటిలోకి పోతున్న సమయంలో 2). మూడపల్లి ఎల్లమ్మ టెంపుల్ ౩). కోనైపల్లె రోడ్ లో 4). కోరుట్ల బుస్స్తాండ్ వద్ద 5). ఏదైన సింగల్ రోడ్ లో మిస్ కాకుండా చంపాలని ప్లాన్ వేసుకొని తన కారు లో రెక్కి కూడా చేసుకున్నారు, తేది 11-05-2018 రోజున మూడపల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద మాటు వేసి ఉన్నారు కాని ఆ రోజు మిస్ అయినాది , తేది 13-05-2018 రోజున నూకలమర్రి గ్రామములో కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎలాగైనా వస్తాడన్న సమాచారం తీసుకొని శివ ను రాజేష్ ను హన్మక్క పల్లి కోళ్ళఫాం వద్ద ఉంచి మహేందర్ ఒక మోటార్ సైకిల్ పై కబడ్డి టోర్నమెంట్ వద్ద గోలి శంకర్ కదలికలను గమనిస్తూ ఉన్నాడు, శంకర్ తన కారు లో బయలు దేరగానే మహేందర్ శివ కు ఫోన్ చేసి అలెర్ట్ చేసి తానూ శంకర్ కారు ను బైక్ పై ఫాల్లో అవుతూ వచ్చినాడు కోళ్ళ ఫారం వద్దకు శంకర్ కారు రాగానే శివ తన కారును స్టార్ట్ చేసి శంకర్ కారును వెంబడించి కొద్ది దూరం పోయిన తరువాత శంకర్ కారును ధీ కొట్టడం తో శంకర్ కారు రోడ్డుకు అడ్డంగా తిరిగినాది, శివ నడుపుతున్న కారు రోడ్డు దిగి పోయినాది శంకర్ కారు దిగగానే, వెంటనే శివ తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రే శంకర్ మొహం పై కొట్టగా రాజేష్, మహేందర్ కు తన వద్ద ఉన్న బ్యాగులోని ఒక వేట కొడవలి ఇచ్చి ఇంకో వేట కొడవలిని రాజేష్ తీసుకొని శంకర్ పై దాడి చేసి రోడ్డు పై వస్తున్నా వాహన దారులను ఎవరు రావద్దని వేట కొడవలి తో బెదిరిస్తూ అక్కడనుండి మోటార్ సైకిల్ పై కొండన్నపల్లి శత్రాజ్పల్లి, వట్టెముల, కోరెం, అనంతపల్లి, వెలిశాల, కురిక్యాల, కరీంనగర్ మీదగా హన్మకొండ వెళ్లి అక్కడ నుండి విజయవాడ హైదరాబాద్ లలో తల దాచుకోన్నరు.

తిరుపతి ముఖ్య అనుచురుడు అయిన చొప్పరి శివ ను కేసు నుండి తప్పించడం కొరకు మహేష్ గంగరాజు ల సహాయం తో బైరెడ్డి వినయ్ ని శివ స్థానం లో ఉంది నేరం ఒప్పుకోవాలని అందుకు గాను ఒక లక్ష రూపాయలు ఇస్తామని ఒపించినారు.