సస్పెన్షన్!రాజీనామా!! నరసారెడ్డి ఎపిసోడ్ లో ఏది ముందు?

హైదరాబాద్:
గజ్వేల్ టిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ నర్సారెడ్డి ఊహించినట్లే జరిగింది. పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నందున గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.తాను ప్రస్తుత పదవిలో ఉంటూ ప్రజలకు సేవలు అందించకాలేకపోతున్నట్టు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఆయన సస్పెన్షన్ ముందు జరిగిందా లేక ఆయన రాజీనామా ప్రక్రియ ముందు జరిగిందా?అన్నది తెలవలసి ఉన్నది.