సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.

హైదరాబాద్ :
మియాపూర్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగిని కీర్తన ఆత్మహత్య. మియపూర్ అల్ విన్ కాలనీ నివాసం ఉండే కీర్తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కీర్తన పెళ్లై 9 సంవత్సరాలు కాగా 6 ఏళ్ల బాలుడు ఉన్నాడు. భర్త శ్రీధర్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. శ్రీధర్ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణ లో ఉన్నాడు. కుటుంబ కలహాల తో ఆత్మహత్య చేసుకుందా, లేక ఇతర కారణాల అనే కోణం లో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.