సామజిక సాధికారత లో తెలంగాణ టాప్ -కేంద్ర మంత్రి గెహ్లాట్.

మహబూబ్ నగర్.
సామాజిక న్యాయం..సాధికారత విషయంలో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన వృద్దులు, దివ్యాంగులకు ఉపకరణాలు బహుకరించే కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. తమ శాఖ ద్వారా తెలంగాణాలో ఇప్పటికే దాదాపు 45 కోట్ల రూపాయల ఖర్చుతో అనేక మంది దివ్యాంగుల కు కావాల్సిన సాధనాలను సమకూర్చామని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కులాంతర వివాహాలు జరిగాయని తమ శాఖ ద్వారా వారికోసం ఇచ్చే రెండు లక్షలా యాభైవేల రూపాయల పారితోషకాన్ని తెలంగాణా రాష్ట్రంలోనే అత్యధికులు అందుకున్నారని చెప్పారు.