సింగరేణిలో కారుణ్య నియామకాలు.

శ్రీ రాంపూర్:
1,344 మంది అన్ఫిట్ కార్మికుల స్థానంలో ఉద్యోగాలు పొందనున్న వారసులు ప్రారంభమైన ఉద్యోగ నియామక పత్రాల అందజేత.సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గత మార్చి నెలలో శ్రీరాంపూర్లో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు సంస్థ ఛైర్మన్&ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.ముఖ్యమంత్రి ఆదేశంపై ప్రభుత్వ డాక్టర్లతో కొత్త మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి నెలలో సాధ్యమయినన్ని ఎక్కువ సార్లు సమావేశ పరుస్తూ కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేశారు. ఏప్రియల్ నెల నుండి జూలై నెల వరకూ గల నాలుగు నెలల కాలంలో రికార్డు స్థాయిలో నిర్వహించిన 10 మెడికల్ బోర్డు సమావేశాలలో మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం ధరఖాస్తు చేసుకున్న 1,921 మందిని పరిశీలించి వీరిలో 1,344 మందిని ఉద్యోగానికి అనర్హులుగా నిర్దారించారు. కాగా మరో 227 మందిని పై స్థాయి వైద్య పరీక్షల కోసం రిఫర్ చేశారు. వీరిలో కూడా చాలా మంది మెడికల్ అన్ఫిట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనారోగ్య కారణాల రీత్యా మెడికల్ అన్ఫిట్ అయిన దాదాపు పదిహేను వందల మంది కార్మికుల కుటుంబాలలో దిగిపోయిన కార్మికుడు సూచించిన వారసునికి వెంటనే ఉద్యోగం ఇవ్వడం కోసం యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టింది. అన్ని ఏరియాలో వెనువెంటనే ధరఖాస్తులను స్వీకరించి ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తోంది. రామగుండం-1 ఏరియాలో డైరెక్టర్ (ఆపరేషన్స్&పా) ఎస్.చంద్రశేఖర్ బుధవారం (ఆగష్టు 1వ తేదీ) దాదాపు 40 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అలాగే శ్రీరాంపూర్, బెల్లంపల్లి, రామగుండం-1, తదితర ఏరియాలలో ఆగష్టు మొదటి వారంలోనే కారుణ్య నియామక పత్రాలను అందజేయనున్నారు.ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్న కార్మికులు , కారుణ్య నియామక ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాలు అందకొన్న నిరుద్యోగలు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో కారుణ్య నియామకాల కోసం కార్మికుడు అన్ఫిట్ అయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చేదని, అవినీతికి, పైరవీలకు కూడా అస్కారం ఉండేదని, కానీ ఇప్పుడు అటువంటివి ఏమి లేకుండానే అన్ఫిట్ అయిన నెలలోపే ఉద్యోగంలోకి తీసుకోవడం చాలా ఆశ్యరంగాను, ఆనందంగాను ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రికి సదా ఋణపడి ఉంటామని కారుణ్య నియామక పత్రాలు అందుకున్న రామగుండం రీజియన్కు చెందిన యువకులు నరేష్, సమ్మయ్య, వెంకటేశం, రాజు తదితరులు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఆదేశంపై ఏప్రియల్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకూ 10 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి 1,992 మందిని పరిశీలింపజేయగా 1,344 మంది మెడికల్ ఇన్వాలిడేట్ అయ్యారని వీరి వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వనున్నామని, అలాగే ధరఖాస్తు చేసిన అందరిని ప్రాథమిక వైద్య పరీక్షలతో మెడికల్ బోర్డుకు పిలవడం జరుగుతుందని దీనికోసం రానున్న రెండూ, మూడు నెలల్లో ఎక్కువ సార్లు మెడికల్ బోర్డు నిర్వహిస్తామని సంస్థ ఛైర్మన్&ఎం.డి. ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. మెడికల్ బోర్డ్ నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, పైరవీలకు ఏమాత్రం అవకాశం లేదని కనుక కార్మికులెవ్వరూ అనవసర ప్రలోభాకు గురికావద్దని, ఎవరైనా పైరవీల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేేసీఆర్ హామీల అమలుకు కూడా యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కార్మికుల క్వార్టర్లకు ఏ.సి.లు పెట్టుకోవడానికి అవసరమైన కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే అన్ని ఏరియాలలో ప్రారంభమైంది. దీనిపై కార్మికులు గృహిణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. రిటెరైన కార్మికులకు వైద్య సౌకర్యం కలిగించే పథకంపై సర్క్యూలర్ జారీ చేయగా అనేకమంది ధరఖాస్తు చేసుకుంటున్నారు. స్వంత ఇంటి నిర్మాణానికి తీసుకున్న 10 లక్షల ఋణంపై వడ్డీ చెల్లించే పథకం కూడా ఇప్పటికే అమలులోకి వచ్చింది. అనేక మంది కార్మికులు ధరఖాస్తు చేసుకుంటున్నారు. ఇతర హామీలపై కూడా సి&ఎం.డి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.