సిట్టింగులకు ‘గండం’!!

హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులలోకొంతమందికి టిక్కెట్ల ‘గండం’ గ్యారంటీగాకనిపిస్తున్నది. అయితే ఆ సంఖ్యపైఅనుమానాలున్నవి.కనీసం 20 మందికి పైగా అభ్యర్దిత్వాలను మార్చక తప్పదనిఇంటలిజెన్సు వర్గాలు చెబుతున్నాయి. పనితీరు సమర్ధంగా లేని వారికి టిక్కెట్ల నిరాకరణకు గాను ‘సర్వే’ ల ఫలితాలు చూపే అవకాశాలున్నవి.“ వజ్రాల్లాంటిఎం.ఎల్.ఏ.లున్నారు ఇంతకంటే గొప్పవాళ్లు ఆకాశం నుంచి ఊడిపడరు.సిట్టింగ్ టిఆర్ఎస్శాసనసభ్యులందరికీటిక్కెట్లుఇస్తాం.ఎవరికీ ఏ అనుమానమూ అవసరంలేదు.కేబినేట్ లోనూ ఎలాంటి మార్పులూ ఉండవు.మీడియా లో అనవసర అపోహలను ప్రచారం చేయొద్దు”అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ గత ఏప్రిల్ 27 న పార్టీ ప్లీనరీలో అన్నారు.సి.ఎం.వ్యాఖ్యలతోఅదివరకు కొన్ని అనుమానాలున్నవారు సైతం సంబరాలు చేసుకున్నారు.ఇక సిట్టింగులకు డోకా లేదనుకున్నారు. కానీ అసలు సంగతి నెమ్మదిగా బయటపడుతున్నది. 39 మంది సిట్టింగ్ టిఆర్ఎస్ శాసనసభ్యుల పరిస్థితి ‘ప్రమాదం’లో ఉందంటూ గురువారం వెలువడిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయా శాసన సభ్యులు తాము మార్చుకోవలసిన‘పద్ధతులు’, సర్వే నివేదికల్లో వచ్చిన ఫలితాల తాలూకు వివరాలను జోడించి ఆ శాసనసభ్యులకేపంపించినట్టు తెలుస్తోంది. 39 అనే సంఖ్య నిజమా?కల్పితమా? తెలియదు.అంతకన్నా కొంత తక్కువ ఉండవచ్చు. లేదా ఒకరిద్దరు ఎక్కువగా కూడాఉండవచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్ గత నాలుగేళ్ళుగా విస్తృతంగా సర్వేలు జరిపిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు పైనా,పాలనా యంత్రాంగం పైనా,ముఖ్యమంత్రి ఫ్యాక్టర్ పైనా,సంక్షేమ పధకాలు, ఇరిగేషన్ప్రాజేక్టులపైనా, మంత్రులు, పార్టీ శాసన సభ్యులపైన, ప్రతిపక్ష పార్టీల పైన నిరంతరం సర్వేలు జరుగుతున్నవి.ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు కెసిఆర్ వడబోస్తున్నారు. సరే, ఇంతకూ ‘ప్రమాదం’ అంచున ఉన్నారని ప్రచారం జరుగుతున్న 39 మంది శాసనసభ్యులలో2014 లో గెలిచిన 63 మందిలో ఎంతమంది ఉన్నారు? ‘రాజకీయపునరేకీకరణ’లో భాగంగా పార్టీ ఫిరాయించి చేరినవారితో మొత్తం సంఖ్య 90 దాటినందునవాళ్ళలో ఉన్నారా? అన్నదానిపైఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో ఇంటింటికి ‘భగీరథ’ నీళ్ళే కాదు,సంక్షేమ పధకాలు కూడా వెళ్ళాయి. కోటి మందికి పైగా ప్రభుత్వ పధకాలు అందుకున్న లబ్దిదారులు ఉన్నట్టు టిఆర్ఎస్ పార్టీ అనుకూలపత్రికలలోఇటీవలవివరాలువెల్లడించారు.నాలుగు కోట్ల తెలంగాణ జనాభాలోకోటిమందికి ప్రభుత్వ ప్రయోజనాలు అందడం సామాన్య విషయం కాదు. ఈలెక్కనగుండుగుత్తగా టిఆర్ఎస్ కు మాత్రమే ఓట్లు పడాలి.ప్రతిపక్షాలకు ఓట్లే రావద్దు. కానీ అసలు సమస్య శాసనసభ్యుల దగ్గరఉన్నది.వారు ప్రజలతో నెరపుతున్న సంబంధాలు,ప్రజల సమస్యల పట్ల తక్షణ స్పందన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో శాసనసభ్యుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలపై జరిపిన సర్వేలలో పలువురు శాసనసభ్యుల పనితీరుకు‘పాస్ మార్కులు’ రావడం లేదని తెలుస్తోంది. సర్వేలలో నిజంగానే ‘పాసు మార్కులు’ రాకపోవచ్చును. లేదాఎవరినైనా ఏ కారణంతోనో, ఇతరత్రాసమీకరణలతోనోఎం.ఎల్.ఏ.ను మార్చవలసి వస్తే‘పాస్ మార్కులు’ రాలేదని కూడా చెప్పవచ్చును. ఏదీ అసాధ్యంకాదు. రాజకీయాల్లోఏదైనా సాధ్యమే. మెజారిటీ  శాసనసభ్యులు, కొందరుఎం.పి.లు, కొందరు మంత్రులు కూడా  వచ్చే ఎన్నికల్లో తమ గెలుపోటముల భారమంతా ముఖ్యమంత్రి కెసిఆర్ పై వేశారు. ముఖ్యమంత్రికి, శాసనసభ్యులకు మధ్య ‘గ్యాప్’ లేదనికొందరు,గ్యాప్ ఉందని మరికొందరు వాదించేవారున్నారు. తమకు కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పరిస్థితి‘అధ్వాన్నంగా’ ఉన్నట్టువివిధ మార్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి అర్ధమవుతున్నది. కరీంనగర్,సిరిసిల్ల,హుజురాబాద్, ధర్మపురి,కోరుట్లఅసెంబ్లీనియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా8 సెగ్మెంట్లలో టిఆర్ఎస్ కు ‘ఆశాజనకంగా’ లేనట్టుతెలుస్తున్నది.జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తో తలపడగలిగిన సమర్ధ నాయకత్వంకొరవడింది. చొప్పదండి,పెద్దపల్లి,మంథని,వేములవాడ,రామగుండం,మానకొండూరు ,హుస్నాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నుంచి ఈ సారి గట్టి పోటీ తప్పకపోవచ్చుననితెలియవచ్చింది. ఇందులో చొప్పదండి, మంథని శాసనసభ్యులపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకులలో ప్రచారంజరుగుతున్నది.సంక్షేమ పధకాల సునామీ కొనసాగుతున్నప్పటికీ స్థానిక శాసనసభ్యుల వ్యవహారశైలి వల్ల టిఆర్ఎస్ కు‘అపాయం’ ఉందనిఅంటున్నారు.సి.ఎం.పెర్ఫార్మెన్సు పై 75 శాతం అనుకూల వాతావరణం ఉన్నది.కానీశాసనసభ్యుల పట్లఎక్కువ  వ్యతిరేకత  ఉంటె‘కెసిఆర్ ఫ్యాక్టర్’ కూడా ప్రభావం చూపకపోవచ్చును. అందువల్ల పనితీరు మెరుగుపరచుకోని వారికిప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అనివార్యమని తెలుస్తున్నది.