సిద్దిపేటలో సినారే వర్ధంతి.

సిద్ధిపేట:
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి సంధర్బంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో సినారె కు శ్రద్ధాంజలి ఘటించారు..ఈ సంధర్బంగా సినారె 60 సంవత్సరాల సాహిత్య సేవలను కొనియాడారు..తెలంగాణ ప్రాంతంలో ని ఒక మారు మూల పల్లె లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సినారె తన అద్భుత ప్రతిభతో గొప్ప సాహిత్యాన్ని వెలువరించారని అన్నారు..ఆధునిక తెలుగు సాహిత్యం పై సినారె వేసిన ముద్ర చేరిగి పోనిదని తెరసం రచయితలు అభిప్రాయ పడ్డారు..సినిమా పాటలు,ఘజల్లు,వచనవిత్వం,పద్యకవిత్వం,సాహిత్య విమర్శ,కథలు వివిధ ప్రక్రియల్లో సినారె అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరించారని గుర్తుచేసుకున్నారు..ఆయన అద్భుత రచన అయిన విశ్వంభర పుస్తకానికి జ్ఞాన పీఠ్ అవార్డు లభించిందని అన్నారు.తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు,ఆయన చేసిన రచనలు చిరస్థాయిగా నిలచి ఉంటాయని తెరసం అభిప్రాయపడింది. సినారె స్ఫూర్తి తో, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తో ఎంతో మంది ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కవులు గొప్ప సాహిత్యాన్ని వెలువరించారని గుర్తు చేసుకున్నారు..ఈ సంధర్బంగా సినారే పై రాసిన కవిత లను చదివి వినిపించారు.. సినారె వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు..కార్యక్రమం లో తెరసం జిల్లా అధ్యక్షుడు పొన్నాల బాలయ్య,కార్యదర్శి గంభీర్రావుపేట యాదగిరి,జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు కె. రంగాచారి,తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షులు నందిని భగవాన్ రెడ్డి,కవులు,యువసాహితి అధ్యక్షులు డబ్భీకారి సురేందర్,వేముగంటి రఘునందన్,మిట్టపల్లి పార్శరాములు,ఎడ్ల లక్ష్మీ,గంగపురం శ్రీనివాస్, శ్రీచరణ్,జీకురు పరమేశ్వరు, అన్నల్ దాసు రాములు,మైసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు..