సిలికాన్ వర్శిటీ స్థాయికి హైదరాబాద్ IIT: రాష్ట్రపతి.

సంగారెడ్డి:
అమెరికాలోని సిలికాన్ వర్శిటీ స్థాయికి హైదరాబాద్ IIT ఎదగాలన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ IIT స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. IITలో కోర్సు పూర్తి చేసుకున్న 560 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని మరింతముందుకు తీస్కెళ్లేందుకు విద్యార్థులు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు సాధించిన పట్టాలు ఉద్యోగాలు, ఉపాధి కొరకు మాత్రమే కాకుండా ఉన్నత సంస్థల స్థాపనకు తోడ్పడాలన్నారు. IIT హైదరాబాద్ తక్కువ కాలంలోనే ఎన్నో రికార్డులను నెలకొల్పిందన్నారు. మలేరియాపై రీసెర్చ్ చేసిన రోనాల్డ్ రాస్ లాంటి వారు ఇక్కడి నుండి వెళ్లినవారేనని రాష్ట్రపతి గుర్తు చేశారు. విద్యార్థులతో సమానంగా విద్యార్థినిలు సమాన సంఖ్యలో విద్యాబ్యాసం పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.