సీబీఐ ఎస్పీగా జయలక్ష్మి!

Amaravathi:

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌.జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా నియామకమయ్యారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం గుంటూరు రూరల్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. జయలక్ష్మితోపాటు ఢిల్లీలో డీసీపీగా ఉన్న 2007 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి నుపుర్‌ ప్రసాద్‌ను కూడా సీబీఐ ఎస్పీగా కేంద్రం నియమించింది. వీరిద్దరూ నాలుగేళ్లపాటు సీబీఐలో పనిచేస్తారు.