సీల్డ్ కవర్ సీఎం కావాలా! సింహం కేసీఆర్ కావాలా? – మంత్రి కేటీఆర్.

హైదరాబాద్:

సీల్డ్ కవర్ సీఎం కావాలా! సింహం కేసీఆర్ కావాలా? అని మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.నరేంద్ర మోదీ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోందన్నారు.తెలంగాణా కు బీజేపీ ప్రభుత్వం ఏమి చేయలేదని విమర్శించారు.హామీలు నెరవేర్చలేదన్నారు.

మోదీ మొదటి 9 నెలల్లో ఒక్క సంతకం పెట్టకుండా సతాయించారని విమర్శించారు.
ఐటీఐఆర్ పై కేంద్రం ఇంతవరకు ఏమి తేల్చలేదన్నారు.బయ్యారం ఉక్కు కర్మాగారం పై ఏదో ఒకటి తేల్చాలని అనేకసార్లు కోరినా ఏది చెప్పరని అన్నారు.కేంద్రం మనకు ఇచ్చిన దానికన్నా,కేంద్రానికి మనం ఇచ్చిందే ఎక్కువ అని తెలిపారు.”రాబోయేది సంకీర్ణ శకం.యాచించడం కాదు..శాసించి తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం.రాహుల్ ఎక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ ఖతమే.హైదరాబాద్ లో అడ్రస్ లేదన్నచోట టిఆర్ఎస్ విజయం సాధించింది.

కాంగ్రెస్ నేతల హామీలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.కాంగ్రెసు హామీలు అమలు కావాలంటే 6 రాష్ట్రాల బడ్జెట్ కావాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.దిగజారుడు హామీలు కాంగ్రెస్ వి.తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ దేవుడిని కూడా ఎదిరిస్తారు.చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్ను పొడిచాడు.ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో పొత్తుకొని సీట్లు అడక్కుంటున్నారు.

కోదండరామ్ ముష్టి మూడు సీట్ల కోసం పొర్లు దండాలు పెడుతున్నారు.మహాకూటమి కాదు…తెలంగాణ పాలిట ద్రోహ కూటమి.

తెలంగాణలో చావులకు కారణమైన వారితో కోదండరామ్ పొత్తులా?ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు కేంద్రానికి అనేక ఉత్తరాలు రాసాడు.

మహాకూటమి విజయం సాధిస్తే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందా.కేసీఆర్ డిల్లీ కి గులాం కాదు.తెలంగాణ ప్రజలకు సలాం గా ఉంటడు”అని మంత్రి కేటీఆర్ అన్నారు.