సుక్మా జిల్లాలో 16మంది మావోయిస్టుల అరెస్ట్.

రాయపూర్:

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో దాదాపు ఐదుగురు నక్సలైట్లు గతేడాది CRPF క్యాంపుపై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో భద్రతా దళాలు అణువణువునా భద్రతను పటిష్టం చేశాయి. ఈ క్రమంలో నక్సలైట్ల కదలికపై సమాచారం అందడంతో మింపా, తాడిమెట్ల సమీపంలోని బార్కాపుల్ క్యాంపు దగ్గర నుంచి పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.