సుప్రీంకోర్టులో తెలంగాణ ఎన్నికలపై పిటిషన్.

న్యూఢిల్లీ:
తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో 20 లక్షల కొత్త ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు.