సుమన్ కు తప్పని ‘గట్టయ్య’ ముప్పు!!

నల్లాలఓదెలుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం,బుజ్జగింపులు, ఆయన శాంతించడం… జరిగిపోయాయి. బాల్క సుమన్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి పూనుకున్నప్పుడే ‘మంటలు’ చెలరేగాయి. తన అభిమాన నాయకుడు నల్లాలఓదెలుకు టికెట్ ఇవ్వాల‌ని పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడో యువకుడు. కాదు తనను హత్యచేసేందుకే ఆయనతో పెట్రోల్ దాడి చేయించారని ఆరోపించాడు మాజీ ఎమ్మెల్యే స్థానంలో వ‌చ్చిన అభ్యర్థి సుమన్. వీరి రాజకీయాలకు అమాయ‌కులు మంటల్లో కాలి ఆసుపత్రి పాల‌య్యారు. ఘటనకు కారకుడని భావిస్తున్న గట్టయ్యచికిత్సపొందుతూ మరణించాడు. ఈ దారుణం జ‌రిగిన36గంట్లోనే సుమన్, ఓదెలుచెట్ట పట్టాలు వేసుకొని కనిపించడం విశేషం. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. గట్టయ్య కాల్ డేటాను విశ్లేషించడంతో పాటు అంతకు ముందు వారం రోజుల వ్యవధిలో ఆయన కార్యకలాపాలపై పరిశోధన జరగవలసి ఉన్నది. గట్టయ్య కు ఎడ‌మ‌వైపున అగ్గిపుల్ల ప‌ట్టుకుని ఉన్న వ్యక్తి ఎవరో తేల్చాల్సి ఉంది. ముందుగా అగ్గిపుల్ల వెలిగించిన వ్యక్తిని కనుగొని పట్టుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంది.

ఎస్.కె.జకీర్.

మాజీ ఎమ్మెల్యే నల్లాలఓదెలు సురక్షితం. ఎంపీ బాల్క సుమన్ సురక్షితం. ‘రాజకీయ చదరంగం’ లో అమాయకుడైన మాదిగ యువకుడు గట్టయ్యబలయ్యాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాలఓదెలుకుటికెట్టు నిరాకరించి అక్కడికి ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను పంపించడంతో ఈ కథ మొదలైంది. పెద్దపల్లి నుంచి డాక్టర్ వివేక్ ను ఈ సారి లోక్ సభకు పంపించడానికి గాను సుమన్ ను అసెంబ్లీ కి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని టిఆర్ఎస్ లో చెప్పుకుంటున్న విషయమే. ఈ సమాచారం కొత్తదేమీ కాదు. అందువల్ల సుమన్ ను చెన్నూరుకు బదిలీ చేశారు. అయితే చెన్నూరులో నల్లాలఓదెలు పార్టీ నిర్ణయాన్ని సులభంగా ఒప్పుకుంటారని ప్రగతిభవన్భావించినట్టున్నది. కానీ ఓదెలు తన తడాఖా చూపారు. కేసీఆర్ కు చుక్కలు చూపారు. తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినందుకు ఓదెలు తీవ్రంగా ప్రతిఘటించారు.తర్వాతనల్లాలఓదెలుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం,బుజ్జగింపులు, ఆయన శాంతించడం… జరిగిపోయాయి. బాల్క సుమన్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి పూనుకున్నప్పుడే ‘మంటలు’ చెలరేగాయి. తన అభిమాన నాయకుడు నల్లాలఓదెలుకు టికెట్ ఇవ్వాల‌ని పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడో యువకుడు. కాదు తనను హత్యచేసేందుకే ఆయనతో పెట్రోల్ దాడి చేయించారని ఆరోపించాడు మాజీ ఎమ్మెల్యే స్థానంలో వ‌చ్చిన అభ్యర్థి సుమన్. వీరి రాజకీయాలకు అమాయ‌కులు మంటల్లో కాలి ఆసుపత్రి పాల‌య్యారు. ఘటనకు కారకుడని భావిస్తున్న గట్టయ్యచికిత్సపొందుతూ మరణించాడు. ఈ దారుణం జ‌రిగిన36గంట్లోనే సుమన్, ఓదెలుచెట్ట పట్టాలు వేసుకొని కనిపించడం విశేషం. మూడుసార్లు చెన్నూరు నుంచి వరుసగా గెలుపొందిన నల్లాలఓదెలుహర్టయ్యారు. ఆయన అనుచరులూ ఆందోళనలు ప్రారంభించారు. ఓదెలుకు అన్యాయం చేశారంటూ మందమర్రిలో కొందరు కార్యకర్తలు రెచ్చిపోయారు. ధర్నా, రాస్తారోకో, కిరోసిన్‌ చల్లుకునే కార్యక్రమాలతో హడావుడి చేశారు. ఓదెలు 11న మందమర్రిలో తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి స్వీయ గృహ నిర్బంధాన్ని విధించుకున్నారు. 24 గంటలలో సుమన్‌ను మార్చేసి తనను అభ్యర్థిగా ప్రకటించకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌ పిలుపుతో ఓదెలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. అదే సమయంలో చెన్నూరు అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్‌ నియోజకవర్గ పర్యటనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని తన అనుచరులతో భారీ కాన్వాయ్‌తో నియోజకవర్గంలో అడుగుపెట్టారు. సరిహద్దులోని జైపూర్‌ మండలం ఇందారం దగ్గర టీఆర్‌ఎస్‌ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈ క్రమంలో ర్యాలీ ముందుగా వెళుతుండగాఇందారంఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గని ఏర్పాటును నిరసిస్తూ కొందరు గ్రామస్తులు సుమన్‌ను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. టీఆర్‌ఎస్‌ నేతలు, మీడియా సిబ్బందికి మంటలు అంటుకున్నాయి. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో అందరూ ఆందోళనకు గురయ్యారు. గాయాలపాలైన వారందరినీ తొలుత మంచిర్యాలకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోల్‌దాడి జరిగిన వెంటనే స్పందించిన ఎంపీ సుమన్” తనను హత్యచేసేందుకే దాడికి పాల్పడ్డార”ని సంచలన ఆరోపణలు చేశారు. ఓ వైపు పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు మంటల్లో చిక్కుకుని అల్లాడుతున్నా, సుమన్ మొండిగా తన పర్యటనను కొనసాగించారు. ఇందారం తర్వాత భారీ హడావుడితో చెన్నూరు కు వెళ్లి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను గెలవడం ఖాయమన్నారు. అయితే గెలుపు సంగతి ఎలా ఉన్న ఘటన జరిగిన తరువాత సుమన్ వ్యవహరించిన తీరే తీవ్ర విమర్శలకు దారితీసింది. టిఆర్ఎస్ కార్యకర్తలు మంటల్లో తగులబడి ఆసుపత్రుల పాలైతే పర్యటనను రద్దు చేసుకోకపోవడాన్ని మెజారిటీ నేతలు తప్పుపట్టారు. పథకం ప్రకారం హత్యాయత్నం చేశారన్నది సుమన్‌ ఆరోపణ. ఓదెలు దీన్ని తీవ్రంగా ఖండించారు. సుమన్‌ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. సుమన్‌ చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని, ఆయన బండారాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళతాననిఓదెలు అన్నారు. ”తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మహత్యల వెనుక ఉన్న సుమన్ బండరాన్ని బయట పెడతా”నని హెచ్చరించారు. ఓదెలు ఎదురుదాడితో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖంగుతిన్నట్టు సమాచారం. పార్టీలో కలకలం రేపింది. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓదెలు అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈయన ఏం చెప్పుకున్నారో, ఆయన ఏ హామీ ఇచ్చారో తెలియదు. కానీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని అన్నారు. చెన్నూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. ఓదెలు ఇచ్చిన ‘ట్విస్ట్‌’తో అంతా ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని, ఒకసారి ప్రగతి భవన్ కాలు పెట్టిన తర్వాత శాంతించక తప్పదని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదెలుకు తెలియదంటే ఎవరు నమ్ముతారు? కానీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పది రోజుల పాటు కార్యకర్తలను ఓదెలు ఎందుకు రెచ్చగొట్టారన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. గట్టయ్య కాల్ డేటాను విశ్లేషించడంతో పాటు అంతకు ముందు వారం రోజుల వ్యవధిలో ఆయన కార్యకలాపాలపై పరిశోధన జరగవలసి ఉన్నది. గట్టయ్య కు ఎడ‌మ‌వైపున అగ్గిపుల్ల ప‌ట్టుకుని ఉన్న వ్యక్తి ఎవరో తేల్చాల్సి ఉంది. ముందుగా అగ్గిపుల్ల వెలిగించిన వ్యక్తిని కనుగొని పట్టుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంది. ఆ విచార‌ణ‌లో ఒకవేళ అగ్గి పుల్ల గీసిన వ్యక్తి లేడ‌నితేలితే, సుమ‌న్ ఎందుకు అలా మాట్లాడారు అన్న దానికి స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. గట్టయ్య మాదిగ అంత్యక్రియలకు హాజరైన మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణా లో మాదిగ జాతి అంతానికే కేసీఆర్ కుట్ర పన్నారంటూ ఆయన ఆరోపించారు. కృష్ణ మాదిగ పర్యటనతో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నవి.