సూపర్ ఎన్నికల కమిషన్ గా బీజేపీ.- కాంగ్రెస్ విమర్శ.

బీజేపీ సూపర్ ఎన్నికల సంఘంగా మారిందా? కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా మారిందనే చెబుతున్నారు. ఇందుకు ఆయన పలు సాక్ష్యాధారాలు కూడా చూపిస్తున్నారు. గుజరాత్ లో కేంద్ర ఎన్నికల సంఘం కంటే ముందుగా బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు ఎన్నికల తేదీలు ట్వీట్ చేయడం ఇందులో మొదటిది. హిమాచల్ ప్రదేశ్ తోపాటు జరగాల్సిన గుజరాత్ ఎన్నికలను ఈసీ విడివిడిగా నిర్వహించింది. దీంతో ప్రధాని మోడీ రెండు చోట్ల వరాల వర్సం కురిపించే అవకాశాన్ని ఇచ్చినట్టయింది. ఇవాళ రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి సన్నాహకంగా రాజ్ కోట్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ముగిసే వరకు వేచి ఉండి ఈసీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా ఇదే తరహాలో ఉందని సూర్జేవాలా ట్వీట్ చేశారు. దీనికి తగ్గట్టుగానే ముందుగా 12.30కి ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన ఉంటుందని ఈసీ తెలిపింది. ప్రధాని రాజస్థాన్ లోని అజ్మీర్ లో 1 గంటకు ర్యాలీలో ప్రసంగించారు. ఈసీ హఠాత్తుగా తన ప్రెస్ కాన్ఫరెన్స్ సమయాన్ని 3 గంటలకు మార్చినట్టు తెలిపింది. ఇది ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిపై కచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తేదే.