సెంట్రల్ కోర్ట్ లో ‘కూటమి’ సమావేశం.

హైదరాబాద్:
‘ప్రజాకూటమి’ నాయకులు సెంట్రల్ కోర్టు హోటల్లో సమావేశం కానున్నారు. సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. టిడిపి ,సిపిఐ ,జనసమితి సీట్ల ప్రతిపాదనల పై మంగళవారం రాత్రి గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ కొర్ కమిటీ చర్చించింది. బుధవారం భేటీలో సీట్ల సంఖ్యపై స్పష్టత రావొచ్చు. ఒకటి రెండ్రోజుల్లో ఉమ్మడి మ్యానిఫెస్టో ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం గాంధీభవన్ లో పీసీసీ ఆఫీస్ బేరర్స్ భేటీ జరుగుతుంది. రాహుల్ టూర్ ,ప్రచారం,పొత్తులు ,సీట్ల సర్దుబాటు చర్చ జరుగుతుంది.