సెప్టెంబర్ లో ప్రియాంక చోప్రా పెళ్లి.

ముంబయి:
‘వెడ్డింగ్ ఆఫ్ ద ఇయర్’ కి డేట్ ఫిక్సయింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సెప్టెంబర్ లో పెళ్లికూతురు కానుంది. తన పుట్టినరోజున ఎంగేజ్ మెంట్ ముచ్చట జరుపుకున్న పిగ్గీ చాప్స్ ప్రియుడు నిక్ జోనాస్ పుట్టినరోజున పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 16న తన 26వ పుట్టినరోజు జరుపుకోబోతున్న నిక్ కు ఇదే మంచి బర్త్ డే గిఫ్ట్ అని పీసీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నిక్ జొనాస్ పుట్టినరోజున పెళ్లి చేసుకొని ఆ రోజుని ఎక్స్ ట్రా స్పెషల్ గా మార్చాలన్నది ప్రియాంక ఆలోచనగా తెలుస్తోంది. మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా భరత్ నుంచి ప్రియాంక తప్పుకోవడానికి ఇదే కారణమని సమాచారం. అదీ కాకుండా ఆ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం కూడా ఈ వాదనకు బలాన్నిస్తోంది.ప్రియాంక ఎంగేజ్ మెంట్ రింగ్ కోసం పాప్ స్టార్ నిక్ న్యూయార్క్ నగరాన్నంతా చుట్టేసి ఓ టిఫానీ స్టోర్ లో ఖరీదైన వజ్రపు ఉంగరం కొన్నట్టు వాళ్ల నిశ్చితార్థాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన పీపుల్ మేగజైన్ చెప్పింది.