‘సైరా’ సెట్స్‌ని కూల్చేసిన అధికారులు.

హైదరాబాద్:
సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా ‘సైర’ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌రణ్ హీరోగా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా కోసం శేరిలింగంప‌ల్లి రెవిన్యూ ప‌రిధిలో వేసిన సెట్స్‌లోనే సైరా మూవీ షూటింగ్ జ‌రుపుతున్నారు. అయితే ఇది ప్ర‌భుత్వ భూమి కావ‌డంతో చిత్ర నిర్మాత‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా య‌దేచ్చ‌గా షూటింగ్ జ‌రుపుతున్న క్ర‌మంలో రెవిన్యూ అధికారులు సైరాలో క‌థానాయ‌కుడి ఇంటి సెట్‌ని కూల్చేశారు. గ‌తంలో ప‌లు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయ‌మ‌ని నోటీసులు పంపిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చిందని అధికారులు అంటున్నారు. ముంద‌స్తు ప‌ర్మీష‌న్ తీసుకుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవార‌మ‌ని, కాని వారు అనుమ‌తుల్లేకుండా సెట్స్ వేసి, ఆ భూమ‌ని స్వాధీనం చేసుకొనే ప్ర‌ణాళిక వేసిన‌ట్టు తెలిసింది. అందుక‌ని సెట్స్ మొత్తాన్ని కూల్చేసిన‌ట్టు తెలిపారు. దీనిపై మూవీ నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సైరా త్వ‌ర‌లోనే యూర‌ప్ షెడ్యూల్ జ‌రుపుకోనుండ‌గా, ఇంత‌లోనే ఇలా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌మ‌ని అంటున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ సంస్ధ‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది.