సోషల్ మీడియాలో హరీశ్ కు మద్దతు వెల్లువ.

రాజ్ కుమార్, ఆదిలాబాద్:

మంత్రి హరీశ్ రావుకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువలా ముంచెత్తుతున్నది.

“హరిషన్న పేరు తెలియని పల్లె తెలంగాణలో లేదు. ఆపద వస్తే గుర్తుకు వచ్చే మొదటి పేరు హారీషన్న. అభివృద్ధికి ఆయనే చిరునామా. టీఆరెస్ లో ఆయన ట్రబుల్ షుటర్. అడుగు పెట్టిన ప్రతి దగ్గరా గెలుపు ఉంది. హరిషన్న కి ఉన్న ప్రజాదరణ చూసి గిట్టని వారు విషప్రచారం చేస్తున్నారు . కేసీఆర్ మాటే నా బాట అని ఏన్ని సార్లు చేప్పిన తప్పుడు రాతలు రాస్తు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఇకనైన చేయడం మానుకోండి.మా అందరి మనస్సుని భాద పెట్టకండి. మా గుండెలో కొలువు అయిన దేవుడు మా హరిషన్న” అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.