స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణంలో మరో మలుపు.

హైద్రాబాద్;
స్పోర్ట్స్ కోటలో మెడికల్ సీట్ల కుంభకోణంలో వెలుగులోకొచ్చిన మరో కోణం. వరంగల్ కు చెందిన తోట సునిల్ కుమార్ తన కొడుకు కోసం స్పోర్ట్స్ కోటలో సిట్ ఇప్పిస్తామని నాలుగు లక్షలకు డీల్ కుదిర్చిన తెలంగాణ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కైలాసం యాదవ్.
సిటు కోసం రెండు లక్షలు చెల్లించిన తోట సునీల్ కుమార్. మెడికల్ సీట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు. బాధితుడు ఫిర్యాదుతో వరంగల్ లోని కైలాసం యాదవ్ ఇంటితో సహా ఎల్బీ స్టేడియంలోని జూడో అసోసియేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.