హరితహారం నాలుగో దశ పై వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్:
పాల్గొన్న అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లాలకు చెందిన అన్ని స్థాయిల అటవీ అధికారులు, సిబ్బంది. నర్సరీల సంసిద్ధత, ఏర్పాట్లు, మొక్కల రవాణా, నాటే ప్రాంతాల గుర్తింపుపై సమీక్ష. మిగతా శాఖలతో సమన్వయం. ఆయా శాఖల పరిధిలో నాటే మొక్కల రక్షణ, నీటి వసతి, ఎదుగుదల నమోదుపై పర్యవేక్షణ.ఎట్టిపరిస్థితుల్లోనూ కనీస ఎత్తు, ఆరోగ్యంగా ఉన్న మొక్కలను మాత్రమే హరితహారంలో నాటాలని నిర్ణయం. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు సరిపడే చెట్లు పెంచేలా చర్యలు. ఈత, టేకు, వెదురు తో పాటు ఇళ్ల ఆవరణల్లో పెంచే మొక్కలకు ప్రాధాన్యత. ఈ సారి హరితహారంలో స్కూళ్లు, విద్యార్థుల భాగస్వామ్యం పెంపు, రేపు విద్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం. బ్లాక్ ప్లాంటేషన్ (నిర్దేశిత ప్రాంతాల్లో) చేపట్టిన మొక్కల పెంపకానికి నీటి సౌకర్యం కల్పనకు ఆదేశాలు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధానాధికారి PK Jha,
ఇతర అధికారులు.