హరీశ్ రావుపై కాంగ్రెస్ ఒంటెరు సంచలనం.

harish rao

మెదక్;

గజ్వేల్ నియోజవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. శనివారం గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంటేరు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద, మంత్రి హరీష్ రావు మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు తారా స్థాయికి చేరిందని ఆయన విమర్శించారు.టిఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అతి త్వరలోనే హరీష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.