హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్:

నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.