హైదరాబాద్ లో యుఏఈ కాన్సులేట్ కార్యాలయం.

హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో త్వరలోనే యు.ఏ.ఈ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ లో యుఏఈ కాన్సులేట్ ఏర్పాటు చేసే విషయంపై చర్చించనున్నారు. యుఏఈలో లక్షలాది తెలంగాణ కార్మికులు పని చేస్తున్నారు. హైదరాబాద్ లో కాన్సులేట్ ఏర్పాటు చేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఢిల్లీలో యుఏఈ రాయబారి అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్ బన్నాని కలిసినపుడు ఎన్నారై వ్యవహారాల మంత్రి కే తారక రామారావు కోరారు. 2016లో యుఏఈ రాయబారి డిప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిసినపుడు హైదరాబాద్ లో కాన్సులేట్, వీసా ప్రాసెసింగ్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. అందుకు అనువైన స్థలం చూపాలని కోరారు.