హైవేపై కారు ఢీకొని వృద్ధుడు మృతి.

నల్లగొండ:

హైవే రహదారిపై కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. జిల్లాలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామం దగ్గర విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే రహదారిపై ఆదివారం ఉదయం కారు ఢీకొన్న సంఘటనలో చందుపట్లకు చెందిన బండి రాములు అనే వృద్ధుడు మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు